శశిథరూర్ వర్డ్స్ : చట్ట సభల్లో ఏం మాట్లాడతాం గురూ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగా ముగియడంతో... వివిధ పార్టీల నాయకులు మీడియా గొట్టాల ముందుకు వచ్చారు. మీడియా జనానికి కూడా కాస్తంత మోటర్ కావాలి కదా... వారు కూడా ఉత్సాహం గానే ఉన్నారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ పార్లమెంట్ సమావేశాలపై మాట్లాడారు. కొన్ని సూచనలుచేశారు. అవి ఎవరికో తెలుసా ?
పార్లమెంట్ లో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు తాము చెప్పదల్చుకున్న విషయాలని చెప్పలేక పోయారని కేరళ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఆయన మీడియా తో మాట్లాడారు. తన అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా వెల్లడించారు. అందులో కొన్ని చెణుకులూ, మరికొన్ని సూచనలూ ఉన్నాయి.
ప్రజాసమస్యలను చర్చించే అవకాశం లేకపోవడం వల్లనే సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు చేయాల్సి వచ్చిందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. సభ సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత పాలక పక్షం పై ఉందన్నారు. సభ్యులు తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని శశి థరూర్ అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతను వినాలని, అందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
దురదృష్ట వశాత్తు ప్రతిపక్ష సభ్యులకు ఆ అవకాశం లేకపోవడంతో వారు పోరుబాట పట్టారని తెలిపారు. ఫలితంగా సభ్యులు తమ స్థాయిని తామే దిగజార్చుకున్నారని కూడా శశిథరూర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష సభ్యలులు తమ ఆందోళనలను మరింత పెద్దవి చేశారని, ఫలితంగా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా మరుగున పడిపోయాయని ఆయన పేర్కోన్నారు. తన అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే తెలియపరిచానని శశిథరూర్ వ్యాఖ్యానించారు. పాలకులే సమావేశపు అజెండా తయారు చేస్తున్నారని, వారి కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని శశిథరూర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలకు, వార మాటలకు విలువ లేకుండా పోతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. చట్టసభల్లో ఎం మాట్లాడతాం .. ప్చ్.. అంటూ పెదవి విరిచారు..