కేటీఆర్ కోసం ఆ సిక్కోలు కుర్రాడి సాహసం ఏంటంటే?
మాక్కూడా ఇష్టం గౌరవం కూడా
తెలంగాణ నేతలంటే
ఇక్కడి వారికి ఇప్పటికీ ఎప్పటికీ ఓ అభిమానం ఉంది
అదేవిధంగా ఆంధ్రా నేతలంటే అక్కడి వారికి కూడా
సాఫ్ట్ కార్నర్ ఉంది .. ఈ విధంగా తెలుగురాష్ట్రాలు
మంచి బంధాలను కొనసాగించడమే ఆనందదాయకం
మా జిల్లా (శ్రీకాకుళం) మా ప్రాంతం అని చెప్పుకోవడంలోనే
సిసలు సొగసు కూడా ఉంది.
పాదయాత్ర చేస్తే క్రేజ్ వస్తుంది సర్..ముందు మీరొక పాదయాత్ర చేయండి అని ఎప్పటి నుంచో లోకేశ్ ను అడుగుతున్నారట టీడీపీ నాయకులు. కానీ లోకేశ్ మాత్రం సరిగ్గా ఎన్నికలకు ఒక ఏడాది ఉండగా చేస్తేనే బెటర్ అని అనుకుంటూ వాయిదా వేస్తూ వస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమయినప్పటికీ పాదయాత్ర చేస్తే మంచి క్రేజు. దీంతో మా ఊరి కుర్రాడు అనగా శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం, సారథి గ్రామానికి చెందిన యువకుడు నడక మొదలుపెట్టాడు. ఈ నడక రాష్ట్రం కోసం రాష్ట్రం ప్రయోజనం కోసం కాదు కేటీఆర్ కోసం కేటీఆర్ చేస్తున్న పథకాలు విని చదివి ఫిదా అయి ఆయనను అభినందించడం కోసం సాగించడం విశేషం. ఈ కుర్రాడి పేరు శేఖర్. కేటీర్ ను కలుసుకుని తన అభిమానం చాటుకునేందుకు గత నెల 30న కేసీఆర్ కు వందనాలు అని ఓ ఫ్లెక్స్ రూపొందింపజేసి నడక ప్రారంభించాడు. దీంతో ఈ పాదయాత్రకు క్రేజ్ వచ్చేసింది. తెలంగాణకు చేరుకున్న ఈ కుర్రాడికి మంచి ఆదరణే ఉంది అక్కడ. ఈ విధంగా ఆయన సాగించిన పాదయాత్రతో కేటీఆర్ తో పాటు చాలా మంది తెలంగాణ నేతలకు ఆనందం కలిగింది. మంచి పాలన మీరు అందిస్తున్నారని శేఖర్ చెబుతూ కేటీఆర్ ను స్వయంగా కలుసుకుని అభినందించడమే తరువాయి.