ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన డ్రైవర్లు..

Satvika
మహా నగరాల్లొ బస్ లేదా ట్రైన్ లలో ఆఫీస్ లకు వెళ్ళడం చాలా కష్టం.. అందుకే చాలా మంది తొందరగా వెల్లెందుకు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులను ఉపయొగిస్తారు. అందుకే వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ లో వీటిని రోజుకు వినియోగించే వాళ్ళ సంఖ్యా రెట్టింపు అవుతుంది. ఈ సర్వీసులు ఒక్కరోజు ఆగితే చాలా మందికి గుండెల్లో గుబులు పుడుతుంది. ఇప్పుడు అందరికీ అదే భయం పట్టుకుంది.

హైదరాబాద్ లోని ఈ సర్వీసులు ప్రయాణీకులకు భారీ షాక్ ఇస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయా డ్రైవర్లు పేర్కొన్నారు. నేడు బంద్ ను చేశారు.. ఈ మెరకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై వేటు పడింది. రాత్రి , పగలు కష్టపడి పని చేస్తుంటే కనీసం జీతం పెంచలెదు.. కమీషన్లు కూడా పెరగ లేదు అంటూ గగ్గోలు పెట్టారు. రాత్రి పని చేస్తున్న ఎన్నో క్యాబ్ లు ఎక్కడికక్కడా నిలిచిపొయాయి.

ఓలా, ఉబెర్‌ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్‌ ఎయిర్‌ పోర్టు మూడు క్యాబ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అవే ఈ మార్గాల్లో నడుస్తున్నాయి.5000 క్యాబ్‌లు 24 గంటల పాటు అటు వైపు సేవల ను అందిస్తున్నాయి.కరొన కారణంగా మూడు వేల సర్వీసు లు మాత్రమే అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. 250 పార్కింగ్‌ చార్జీలు, డీజిల్‌ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల హెడ్ పేర్కొన్నారు.. గతం లో ప్రభుత్వం చెప్పిన విధంగా కిలో మీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ చర్చలు ఇంక ఎన్ని రోజులు జరుగుతాయో చూడాలి.. త్వరగా క్యాబ్ సంస్థలు చర్యలు తీసుకోవాలి.. లేకుంటే మాత్రం చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: