రేవంత్ కొత్త ఎత్తు...టీడీపీతోనే బెనిఫిట్?

frame రేవంత్ కొత్త ఎత్తు...టీడీపీతోనే బెనిఫిట్?

M N Amaleswara rao
తెలంగాణలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో చెప్పాల్సిన పని లేదు. ఏ పార్టీకి లేని విధంగా ఆ పార్టీకి రూట్ లెవెల్‌లో క్యాడర్ బలం ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలు టీడీపీకి సపోర్ట్‌గా ఉండేవి. అయితే రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ చాలా వరకు నష్టపోయింది. చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. పైగా ఓటుకు నోటు కేసు తర్వాత టీడీపీ నేతలంతా టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అలాగే క్యాడర్ సైతం టీఆర్ఎస్ వైపు తరలివెళ్లింది.
వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్‌లో ఉన్న మెజారిటీ నేతలు, మెజారిటీ క్యాడర్ టీడీపీ నుంచి వచ్చినవారే. అంటే టీడీపీ ప్లేస్‌ని టీఆర్ఎస్ రీప్లేస్ చేసిందని చెప్పొచ్చు. అయితే రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ వైపుకు వెళ్ళడంతో కొంత క్యాడర్ అటు వైపుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కువగా పాత టీడీపీ క్యాడర్‌ని తమ వైపుకు తిప్పుకోవాలని రేవంత్ చూస్తున్నారు. అప్పుడే కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పెంచడానికి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌లో ఉన్న మాజీ టీడీపీ నేతలని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు నేతలు ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్నారు. వారిని కాంగ్రెస్ వైపు లాగితే కాస్త క్యాడర్ కూడా వస్తుందని చూస్తున్నారు.
అదేవిధంగా రాజకీయాలకు దూరం జరిగిన టీడీపీ నేతలని కూడా దగ్గర చేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. ఇదే క్రమంలో కొత్తకోట దయాకర్ రెడ్డి...ఆయన భార్య సీత దయాకర్‌లని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అరవింద్ కుమార్ గౌడ్‌ని కూడా పార్టీలోకి తీసుకురావడానికి చూస్తున్నారని తెలుస్తోంది. ఇలా టీడీపీ నాయకులని లాగి, కొంత పాత క్యాడర్‌ని లాగితే...కాంగ్రెస్‌కు బెనిఫిట్ అవుతుందనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. మరి చూడాలి రేవంత్ వ్యూహాలు ఏ మేర సక్సెస్ అవుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: