అదిరిందహే : జనసేన టార్గెట్ ఆ మంత్రే ఎందుకంటే ?
ఒకరికి ఏమీ లేకుండా చేయాలన్నది కూడా ప్లాన్
వైసీపీ ప్లాన్ కానీ కోర్టు మాత్రం అడ్డుకుని సీన్ ను రివర్స్ చేసింది
పవన్ కు ఇంకా ఇతర నిర్మాతలకు అండగా నిలిచింది
ఓ విధంగా జగన్ కు ఇదొక పరాభవం మరియు అవమానం కూడా
మరి అవమానం భారం కారణంగా ఆయన ఏమయినా సినిమా పరిశ్రమకు చేటు తెచ్చేలా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారా?
రాష్ట్రంలో అమలవుతున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రజలకు ఇబ్బంది అయ్యే జీఓలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జనసేన సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను అడ్డుకునేందుకు తమకున్న పరిధిలో సోషల్ మీడియానే వేదికగా చేసుకుని, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు, వైసీపీకి మధ్య యుద్ధం నడుస్తోంది. యుద్ధం కారణంగా వైసీపీ సోషల్ మీడియా ప్రత్యేకంగా తనని తాను సన్నద్ధం చేసుకుంటున్నా కూడా కోర్టులు వద్దన్న ప్రతి నిర్ణయం వెనుకా సలహాదారులున్న వైనంపై జనసేన విమర్శిస్తోంది. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ తీసుకు వచ్చిన జీఓ ను హై కోర్టు డిస్మిస్ చేయడంతో జనసేన పండుగ చేసుకుంటోంది.
ఇదే సందర్భంలో మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేస్తూ వరుస కామెంట్లు చేస్తోంది. ఆ రోజు పేర్నినాని చేసిన వ్యాఖ్యలేవీ ఆయన స్థాయికి తగనివని, అయినా కూడా నాని తమ నాయకుడ్ని ఉద్దేశించే ఈ జీఓ తెచ్చారన్నది బహిరంగ రహస్యమని కానీ ఇవాళ జీఓ రద్దయ్యాక నాని మాట్లాడకుండా ఎక్కడ దాక్కున్నారని మండిపడుతోంది. వకీల్ సాబ్ ను టార్గెట్ గా చేసుకుని ఆ రోజు మాట్లాడినా నాని ఇప్పుడు ఏం చెబుతారని కూడా ప్రశ్నిస్తోంది. టికెట్ ధరలు పెరిగినా తగ్గినా ఇష్టం ఉన్నవారే సినిమాకు వస్తారని ఇందులో బలవంతపు పెద్దరికం ఏమీ ఉండదని ఆ పాటి కూడా తెలియకుండా ఏపీ సర్కారు ధరలు తగ్గిస్తూ చౌక ధరలకే వినోదం అన్న నినాదంతో ప్రజల దగ్గర సింపతీ కొట్టేయాలని చూసిందని అంటున్నారు జనసేన నాయకులు.