'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

praveen
పాలసీదారుల  అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను తీసుకువస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న బీమా రంగ సంస్థగా కొనసాగుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే ఇప్పటికే తమ పాలసీదారుల కోసం ఎన్నో రకాల కొత్త పాలసీలు తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త పాలసీని తెర మీదికి తెచ్చి  పాలసీదారులు అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ. ఎల్ఐసి ధన రేఖ ప్లాన్ అనే కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది.

 ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండి విజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కావడం గమనార్హం.. ఇక ఈ పాలసీ లో ఎన్నో బెనిఫిట్స్ ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈ పాలసీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పాలసీ లో మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం పురుషులు మహిళలు మాత్రమే కాదు థర్డ్ జెండర్ కూడా ఇక ఈ పాలసీ ద్వారా మహిళలు పొందే ప్రీమియం రేట్ పొందవచ్చు. మరి ఎల్ఐసి తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అంటే..

 పాలసీలో కనీస బేసిక్ అష్యూర్డ్ రెండు లక్షలు గా నిర్ణయించారు. అయితే గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు . ఈ పాలసీ తీసుకున్న ఆరేళ్ల నుంచి ప్రతీ ఏడాది గ్యారెంటీడ్ అడిషన్స్ పొందవచ్చు అంటూ  ఎల్ఐసీ చెబుతోంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీ హోల్డర్‌కు మనీ బ్యాక్ డబ్బులో ఎలాంటి మినహాయింపులు ఉండవని.. మొత్తం సమ్ అష్యూర్డ్ పొందేందుకు అవకాశం ఉందని ఎల్ఐసి చెబుతోంది. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న ఈ సమయంలో  మరణిస్తే వారి కుటుంబానికి పాలసీ పొందేందుకు హక్కు కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: