ఆహా.... ఏమి సినిమా తెలివిరా బాబూ....!


సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈయన గురించి, ఈయన చేసే రాజీకీయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలసింది ఏమీ లేదు. తన పార్టీ  జనసేన 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జనసేన అధినేత గా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లు కూడా ఘోరంగా ఓడిపోయారు. ఆ పార్టీ ఒకే ఒక స్థానం నుంచి విజయం సాధించింది. అయితే ఆ ఎం.ఎల్.ఏ ఆయన్ని అనధికారికంగా విడిచి పెట్టి, అధికార పార్టీ వై.ఎస్ ఆర్ సిపి తో తిరుగుతున్నారు. కట్ చేస్తే....
పవన్ కళ్యాణ్ అనే సినీ నటుడు తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు రాజకీయ యాత్రలు చేస్తారనే అపవాదు ఉంది.  సినీ జనం ఏమనుకుంటున్నారో తెలుసా?...,జస్ట్ హ్యవ్ ఏ లుక్...
ఇది 2016 వనాటి ముచ్చట... బహుశా  ఆయన నటించిన  గబ్బర్ సింగ్  చిత్రం విడుదల సమయం... సహజంగానే సినీ పాత్రికేయులు సినిమా రిలీజ్ కు ముందే  ఆయన్ని కలిశారు. ఇంకేముంది ఆయన తనదైన శైలిలో మాటలుకోటలు దాటించేశారు. ప్రస్తుతం తాను రెండు సినిమాలు అంగీకరించి ఉన్నానని,అవి పూర్తయ్యాక ఇక రాజకీయాలపై దృష్టి పెడతానని ప్రకటించేశారు. అయ్యో ఇది తమ అభిమాన నటుడి చివరి సినిమా నా అంటూ ఫ్యాన్స్ ఆ సినిమాను హిట్ చేసేశారు.
ఆ తరువాతసంవత్సరం అంటే 2017  కాటమ రాయుడు సినిమా... సేమ్ సీన్ రిపీట్.  తెలుగువాళ్ల ఆత్మ గౌరవం దెబ్బతింటోంది అంటూ గగ్గోలు పెట్టారు. అంతే కాదు విశాఖ పట్నం వేదిక గా ఆత్మగౌరవ దీక్ష చేస్తానని ప్రకటించారు.  సంవత్సరాలు గడుస్తున్నా.. మధ్యలో ఎన్నికలు వచ్చినా విశాఖ దీక్ష ఉసే లేదు.
ఆ తరువాత చిత్రం అజ్ఞాత వాసి...జనవరి 10వ తేదీ 2018లో విడుదలైన  పవన్ సినిమా... ఇప్పుడు కూడా అంతే... ఈ  సినిమాకు నెల, రెండు నెలల ముందు నుంచే మన హీరో గారు రాజకీయ యాత్రలు చేశారు.  తెలుగు దేశం పార్టీతోను, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తోనూ  రాసుకుపూసుకు తిరిగారు.  అలా అజ్ఞాత వాసిని ప్రమోట్ చేసుకున్నారు.
 ఆ తరువాత కన్నాళ్లకి కరోనా ఎఫెక్ట్... సినీ ప్రపంచం అంతా అతలాకుతలం అయింది. కరోనా ప్రభావం  కాస్త తగ్గాక వకీల్ సాబ్  వచ్చారు. అదే సమయంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. ఇంకేముంది రాజకీయ సభల ద్వారా యధావిధిగా సినిమా ప్రమోషన్.  ఆ సినిమా రిలీజ్ కు ముందే  మీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పండి వకీల్ సాబ్ వస్తున్నాడని... అంటూ పంచ్ డైలాగ్ లతో ఆ సినిమా ప్రమోషన్..
అంతే కాదండోయ్... మరో నెల రోజుల్లో ఇంకా సినిమా విడుదలకు డేట్ ఇచ్చేశారు. అదే భీమ్లా నాయక్.. ఈ సినిమా 2022 జనవరిలో సంక్రాతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో  పవన్ కళ్యాణ్ కు హఠాత్తుగా దీక్షలు గుర్తుకు వచ్చేశాయి. ఇంకే ముంది... విశాఖఉక్కు దీక్ష చేశారు. మీడియా జనం కూడా భారీగా కవరేజ్ ఇచ్చేశారు.  హీరో అభీమానులు భీమ్లానాయక్ కు చెందిన ఫోటో స్టిల్స్ ను  విశాఖ ఉక్కు దీక్ష సందర్భంగా  అక్కడికి విచ్చేసిన జనవాహినికి పంచి పెట్టారు.  అలా తనదైన ప్రచారం చేసుకున్నారు. ఆయన చేరో మరో దీక్ష గురించి తెలుసుకోవాలంటే... త్వరలో విడుదల కానున్న చిత్రం సమాచారం తెలుసుకుంటే చాలు. అంతకు కొద్ది రోజుల మందే రాజకీయ ప్రసంగాలు చేస్కారు. జనాల్ని అట్రాక్ట్ చేస్కారు..  ఆహా.... ఏమి తెలివిరా బాబూ.. అంటూ సినీ జనం ముక్కున వేలేసుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: