హ్యాపీ సండే 12-DEC: ఈ వారం టీడీపీ ఏం చేసిందంటే... !

Chakravarthi Kalyan
ఇవాళ ఆనంద ఆదివారం..అదేనండీ హ్యాపీ సండే.. మరి ఈ వారం రోజుల్లో టీడీపీ ఏం చేసిందో తెలుసుకుందామా.. ఏపీ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో టీడీపీ దూకుడు పెంచింది. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ వారంలో ఉద్యోగుల సమస్యలు బాగా హైలెట్ అయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్‌సీ, సీపీఎస్, ఇతర అంశాలపై ప్రభుత్వంపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇవే అంశాలను టీడీపీ కూడా ఫోకస్ చేసింది.

గతంలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీపీఎస్ అంశాన్ని అధికారంలోకి వచ్చిన వారంలో పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు టీడీపీ ఆ పాత వీడియోలను బాగా వైరల్ చేస్తోంది. పాత వీడియోలను వినిపిస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తోంది. చంద్రబాబు కూడా ఈ వారంలో పలు ప్రెస్ మీట్లు నిర్వహించారు. అందులో జగన్ గతంలో ఇచ్చిన హామీలు.. ఇప్పుడు జరుగుతున్న విషయాలను ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిలవుతోందని చెప్పేందుకు టీడీపీ తన వంతు ప్రయత్నం చేస్తోంది.

ఇక టీడీపీ ఈ వారం బాగా ఫోకస్ చేసిన అంశం వన్ టైమ్ సెటిల్ మెంట్ అంశం.  జగన్ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా గతప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లకు పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు నామమాత్రంగా కొంత రుసుము విధించారు. ఇప్పుడు ఈ అంశాన్ని టీడీపీ బాగా ఫోకస్ చేస్తోంది. ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఎందుకు ఫీజులు వసూలు చేస్తారని నిలదీస్తోంది.

వీటితో పాటు వరదల సమయంలో వైసీపీ సర్కారు తీరు సరిగ్గా లేదన్న అంశాన్ని కూడా టీడీపీ ఈ వారం బాగా ఫోకస్ చేసింది. ఇటీవల సీఎం జగన్ వరి సాగుపై చేసిన వ్యాఖ్యల అంశంపైనా టీడీపీ స్పందించింది. వరి సాగు మానేసి గంజాయి సాగు చేయాలని అని ప్రశ్నించింది. అయితే.. ఎక్కువగా చంద్రబాబే ప్రెస్ మీట్లలో కనిపించారు. ఆయనతో పాటు పట్టాభి, వర్ల రామయ్య, గోరంట్ల వంటి కొందరు మీడియా ముందుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: