వామ్మో.. విదేశాల నుంచి ఏపీకి 12,500 మంది?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ భయం పట్టుకుంది. మొన్నటి వరకు రెండవ దశ కరోనా వైరస్ తో అల్లాడిపోయాయ్ ప్రపంచ దేశాలు . శర వేగంగా స్పందించి  కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో  కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నా సమయంలో మళ్లీ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగులోకి రావడం మాత్రం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది.  డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్  ఓమిక్రాన్ ఐదురెట్లు ప్రమాదకరమైనది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.ఇప్పటివరకు ఎత్తివేసిన ఆంక్షలను  మళ్లీ అమలులోకి  తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

 ఇక రెండవ దశ కరోనా వైరస్ కారణంగా అల్లాడిపోయిన భారత్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎయిర్పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల కఠిన ఆంక్షలు విధించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఎయిర్పోర్టులో పరీక్షలు నిర్వహించుకోవాలని నెగటివ్ వస్తే నే ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళాలి అంటూ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణికులు వస్తున్నాడు అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన కొంతమంది ప్రయాణికులు ఆచూకీ దొరకలేదని ఇటీవలే కొన్ని వార్తలు గా మారిపోయాయి.

 ఇకపోతే డిసెంబర్ ఒకటవ తేది నుంచి విదేశాల నుంచి ఏపీ అడ్రస్ తో ఇప్పటివరకు ఏకంగా 12 వేల ఐదు వందల మంది భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా విశాఖ జిల్లాకు 1700 మంది వచ్చారట. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో వచ్చిన పన్నెండు వేల ఐదు వందల మందిలో తొమ్మిది వేల మంది అడ్రస్లను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే మిగతా వారి నుంచి మాత్రం స్పందన లేకపోవడం గమనార్హం. ఫోన్ స్విచాఫ్ చేయడంతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించ లేకపోతున్నారు అధికారులు. ఇలా వివరాలు సేకరించిన వారిలో ఇద్దరికీ పాజిటివ్గా తేలగా మరికొంతమందిని అటు జినోమ్ సెక్వెన్సింగ్ కోసం పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: