వావ్.. మళ్లీ బస్సెక్కిన్న సజ్జనార్?

praveen
మొన్నటివరకు సైబరా బాద్ సిపి గా కొనసాగిన సజ్జనార్ నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర వహించారు. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టారు సజ్జనార్. ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రోడ్డు రవాణా సంస్థను ప్రయాణికులు అందరికీ కూడా మరింత చేరువ చేసే విధంగా ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు అవసరమైన ప్రాంతాల్లో కొత్త సర్వీసులను కూడా ప్రారంభిస్తూ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు ఎండి సజ్జనార్.

 ఒకవైపు ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు రావడమే కాదు ఇక ప్రయాణికులు అందరికీ మెరుగైన సర్వీసులు అందించడానికి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ రంగంలోకి దిగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి గురువారం కూడా ఆర్టీసీ బస్సు డే గా ప్రకటించాలని సజ్జనర్ స్వయంగా సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం. మరోసారి టి ఎస్ ఆర్ టి సి ఎమ్ డి సజ్జనార్ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల బాధలు అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 హైదరాబాద్లో ఉన్న తన నివాసం నుంచి లకిడికపూల్ మీదుగా టెలిఫోన్ భవన్ వరకు కాలి నడకన వచ్చిన సజ్జనార్ మెహదీపట్నం డిపోకు చెందిన బస్ ఎక్కి టికెట్ తీసుకొన్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా బస్ భవన్  వరకు బస్సు లో ప్రయాణించారు సజ్జనార్. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల తో ముచ్చటించారు. సిబ్బంది ప్రవర్తన సమయపాలన బస్సులో శుభ్రత సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తే ప్రయాణికుల కష్టాల  తెలుస్తాయని.. అందుకే ఇలా ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: