చిత్తూరుకు.. జియోలజిస్టులు..!

Chandrasekhar Reddy
చిత్తూరులో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ తాజాగా భూమి అడుగుభాగం నుండి ఏవేవో అరుపులు శబ్దాలు రావడమే అందుకు కారణం. అయితే అవన్నీ భూప్రకంపనలకు కారణం కావని నిపుణులు అంటున్నారు. తాజాగా అక్కడ సంభవించిన వరదల కారణంగా ఒక భావి నీటిపై తెలియాడిన విషయం పై నిపుణులు శ్రద్ద పెడుతున్నారు. దానికి కారణాలను విశ్లేషించడం అవసరం అని భావిస్తున్నారు. భూమి పొరలలో ఏవైనా మార్పులు వస్తున్నాయా లేదా ఏదైనా ప్రమాద సూచికా అనేది వాళ్ళు పరీక్షించదలిచారు. దానికోసమే ఏపీసీఎం జగన్ చిత్తూరుకు జియాలజీ నిపుణులను పంపిస్తున్నారు. ఈ భూగర్భ నిపుణులు ఆయా ప్రాంతాలలో పర్యటించి, వాటిని పరీక్షించి తగిన కారణాలను విశ్లేషించనున్నారు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా చిత్తూరులో సంభవించాయి. అప్పుడు కూడా జనం భూకంపం వచ్చిందేమో అని భయపడ్డారు కానీ అలాంటివి ఏమి జరగలేదు. దానితో ఆ విషయం కనుమరుగైంది. మళ్ళీ ఇప్పుడు వింత శబ్దాలు రావడం, భూమిలో బావి పైకి రావడం లాంటివి చూస్తుంటే అక్కడ భూగర్భంలో ఏవైనా మార్పులు జరిగాయా అనేది పరిశీలించనున్నారు. ఇటీవల వరదల కారణంగా ఈ మార్పులు ఏమైనా చోటుచేసుకున్నాయా అనేది తెలుసుకోనున్నారు. పుంగనూరు, యర్లపల్లె, ఆవులపల్లె, రామాసముద్ర ప్రాంతాలలో ఇలాంటివి చోటుచేసుకున్నాయి.
అర్ధరాత్రిలో ఇలాంటివి ఎక్కువగా సంబవిస్తున్నట్టుగా ప్రజలు చెపుతున్నారు. వంద ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తాజా కుండపోత వర్షాలు వచ్చినది చూశాం. వర్షాల తరువాత నుండే ఈ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి. గత 20 రోజులలో ఇవి మరి ఎక్కువగా ఉన్నాయని అక్కడ ప్రజలు చెపుతున్నారు. భూమి పొరల మధ్య రాపిడి వలన శబ్దాలు వస్తాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారీ వర్షాల కారణంగా భూమి పొరలలో నీరు ఎక్కువ కావడం కూడా సమస్యకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ప్రజలు మాత్రం ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టుగా భయపడుతున్నారు. జియోలజిస్టులు ఆయా ప్రాంతాలలో పర్యటన అనంతరం నిజమైన కారణాలు తెలియరానున్నాయి. అప్పటివరకు ప్రజలకు ప్రాంతీయ అధికారులు ఎప్పటికప్పుడు అండగా ఉండనున్నారు. అలాగే అక్కడి నేతలు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: