బండి సంజయ్ ఎందుకు సైలెంట్...?

Gullapally Rajesh
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ముందుకు నడిపించేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉండటం పట్ల పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దాన్యం కొనుగోలు కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో బండి సంజయ్ సైలెంట్ గా ఉండడం పట్ల కాస్త ఇబ్బందికర వాతావరణం తెలంగాణ బీజేపీలో నెలకొన్నది అనే మాట వాస్తవం.
పార్టీ వ్యవహారాల విషయంలో ఈ మధ్యకాలంలో  కిషన్ రెడ్డి అలాగే ధర్మపురి అరవింద్ ఎక్కువగా జ్యోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులతో మాట్లాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొని పార్టీ బలోపేతానికి కాస్త ముందు అడుగు వేస్తూ ఉండగా బీజేపీ లోకి వచ్చి కొంత మంది నాయకుల విషయంలో ధర్మపురి అరవింద్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న పార్టీలోకి తీసుకు నేందుకు కాస్త ధర్మపురి అరవింద్ ఎక్కువగా జోక్యం చేసుకోవడం అలాగే ఢిల్లీలో ధర్మపురి అరవింద్ కు అన్ని విధాలుగా రక్షణ కల్పించి బీజేపీ జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయనను పార్టీలో తీసుకోవడం వంటివి బాగా హైలైట్ అయ్యాయి.
అయితే ఈ వ్యవహారంలో బండి సంజయ్ పెద్దగా కనపడక పోవటంతో అసలైన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అనేది ఆ పార్టీ నాయకత్వానికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం ధర్మపురి అరవింద్ అదేవిధంగా కిషన్రెడ్డి ఎక్కువగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి కూడా సిద్ధం కావడంతో బండి సంజయ్ పాదయాత్ర దాదాపుగా వాయిదా పడింది అనే ప్రచారం కూడా తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: