బాలయ్య ఆస్పత్రికి అవార్డు...
ఆదరించే గుణంలో అమ్మ
వెన్నుతట్టి నడపడంలో నాన్న
బాలయ్య అమ్మానాన్నల దీవెనలు
బసవ తారకం తారక రామారావు దీవెనలు
వెరసి ఆ ఆలయాన్ని ఉన్నత స్థాయికి చేర్చాయి
ఆస్పత్రి అని రాయొద్దు అని అన్నారు బాలయ్య.. ఆలయం అని రాయండి అని చెప్పారు బాలయ్య. అవును ఆలయానికి ఉన్నంత పవిత్రత ఆ ఆస్పత్రికే ఉంది. ద వీక్ మ్యాగ్జైన్ దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలందించిన వైనంలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి - రీసెర్చ్ ఇన్సిట్యూట్ ఆరో స్థానంలో నిలిచింది. నాన్న స్ఫూర్తితో నడిపే ఈ ఆలయాన్ని బాల య్య ఎప్పుడూ అత్యంత ఆధునికీకరణ ప్రక్రియకు చేరువగానే ఉంచుతారు. సేవకు ప్రాధాన్యం ఇస్తారు. కరోనా లాంటి పేండమిక్ సిట్యువేషన్ లోనూ ఈ ఆస్పత్రి సర్జరీలు ఆపలేదు అని బాలయ్య అంటున్నారు. ఈ సందర్భంగా తన ఆస్పత్రి సిబ్బందికి, వైద్యులకు శుభాభినందనలు తెలిపారు. ఈ క్రమంలో పేదలకు అండగా ఉన్న ఆ ఆస్పత్రికి మరింతగా వెన్నుదన్నుగా నిలిచేందుకు బాలయ్య అభిమానులు సైతం తమవంతు ఆర్థిక తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. మొన్నటి అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యను కలిసిన వివిధ జిల్లాల అభిమానులు ఆస్పత్రి ఎదుగుదలకు మేము సైతం అని ముందుకు వచ్చి మానవతను చాటడం ఎంతైనా అభినందనీయం.