జిల్లాల పునర్విభజనతో కళా వెంకట్రావు లాంటి నేతలు ఇబ్బందుల్లో పడిపోవడం ఖాయం. ఉద్యమాన్ని సమర్థిస్తూ విభజన వద్దని అంటూ రోడ్డెక్కితే కాస్తయినా పరువుతో నిలదొక్కుకునే ఛాన్స్ ఉంది. కానీ కళా ప్రత్యక్ష పోరాటాలు చేసిన దాఖలాలే తక్కువ. కనుక ఆయనకు అంతగా పొలిటికల్ మైలేజీ లేదు. ఒకవేళ ఆయన పోరు తీవ్రం చేసినా కూడా జనం నమ్మరు. ఈ క్రమంలో గతంలో ఆయన చేసిన తప్పిదాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటుకు సంబంధించి చేసిన తప్పిదాలు ఇవన్నీ జనాలకు గుర్తుకు రావడం ఖాయం. ఎలా చూసుకున్నా కళాకు అటు రాజాం ఇటు ఎచ్చెర్ల ఏవీ కలిసి వచ్చేలా లేవు. పోనీ విజయనగరం పొలిటిక్స్ బాగున్నాయా అంటే అక్కడ కూడా టీడీపీ వీక్ గానే ఉంది. కళా కుటుంబానికి కలిసివచ్చిన చీపురుపల్లి నియోజకవర్గం లో అప్పటిలా టీడీపీని ఆదరించే ఛాన్స్ తక్కువే! ఇదే సమయంలో కళాను వ్యతిరేకించే అచ్చెన్న వర్గం మాత్రం బలపడుతోంది.ఒకవేళ మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ వైసీపీకి వెళ్లినా కూడా టీడీపీ మాత్రం కళాకు గతంలో మాదిరిగా గౌరవం అయితే రాదు. అటు రాజాంలోనూ కళాకు గతంలో మాదిరిగా ఆదరించే వారు లేరు. కళాను ఢీ కొనే శక్తులు ఇప్పుడెక్కువగా ఉన్నాయి.
వచ్చే ఎన్నికలు అన్నీ చాలా రసవత్తరం కానున్నాయి. ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్న విధంగా ఉండనున్నాయి. ఇందులో భాగంగానే శ్రీకాకుళం రాజకీయాలలో చాలా మార్పులు రానున్నాయి. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలను శాసించే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తన రాజకీయ భవితవ్యం ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ఒకప్పటిలా పరిణామాలు ఇప్పుడు లేవని మథనపడుతున్నారు. ఎచ్చెర్లలో ఇప్పుడు పనిచేస్తున్న టీడీపీ నాయకులంతా కళావెంకట్రావు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్న కలిశెట్టి నాయకులంతా పార్టీ నుంచి సస్పెండ్ అయినా అవేవీ పట్టించుకోకుండా జనంలోకి బాగానే వెళ్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఒకవేళ జిల్లాల పునర్విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలిసిపోతే ఇక కళా ఆశలు గల్లంతే! ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ స్థానిక వ్యతిరేకత ఉంది.
విజయనగరం పార్లమెంట్ నియోకవర్గాన్ని ఓ జిల్లా కింద పరిగణించి ఎనౌన్స్ చేస్తే, కళా అందుకు అడ్డుకోలేక, తీవ్రమయిన పోరాటం చేయలేక ఇంటికే పరిమితం అయితే ఇక ఆయనను ఎవ్వరూ రక్షించలేరు. అలా కాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచి కీలక నిర్ణయం ఒకటి తీసుకుని, తాము ప్రజాభీష్టం మేరకు నడుచుకున్నామని చెబితే జగన్ కు మైలేజీ పెరిగినట్లే! ఈ విధంగా ఎలా చూసుకున్నా కళాకు పునర్విభజన నష్టమే! ఇదే సమయంలో కొడుకు అందుకుని రాలేదు. ఆయన నాయకత్వంపై నియోజక వర్గంలో ప్రజలకు అభిప్రాయమే లేదు. ఒకవేళ అచ్చెన్న వర్గం ఇక్కడ సక్సెస్ అయితే కళాకు పూర్తిగా పార్టీలో చోటే లేకుండా పోతుంది. అందుకు తగ్గ పరిణామాలు కూడా సిద్ధంగానే ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కళా పోటీ చేయరని ఇంటికే పరిమితం అని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే కళా తప్పుకుని సీన్ లోకి కొడుకు వస్తారు. కానీ ఆయన పెద్దగా
ప్రభావితం చేయలేరనే తెలుస్తోంది.