అప్పులు పుట్టడం లేదు కనుక ఆస్తులు అమ్మారు. అయినా అదే నేరం కాదు అని తేల్చేశారు. అప్పులు పుట్టడం లేదు కనుక ఆస్తులతో పాటు ఇంకొన్ని తాకట్టులో ఉంచారు. అది కూడా తప్పేం కాదనే చెప్పారు. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదు కనుక వివిధ సంస్థలలో (ప్రభుత్వ రంగ సంస్థలలో ) ఉన్న ఆదాయాలపై కన్నేశారు. అంతేకాదు ఉద్యోగులు దాచుకున్న డబ్బులపై కూడా కన్నేశారు. దీంతో ఆగ్రహం ఆపుకోలేక ఉద్యోగులంతా నిరసన చేసి తమ భవిష్యత్ నిధి నుంచి డబ్బులు ఎలా లాక్కుంటారని అడిగి ఆఖరికి ఆ నిర్ణయం వెనక్కు తీసుకునేలా చేశారు. ఇన్ని చేశాక కూడా డబ్బులు చాలడం లేదు ప్రభుత్వానికి. సంక్షేమానికి నిధులు చాలడం లేదు జగనన్నకు..ఏటా లక్ష కోట్ల రూపాయలు సంక్షేమానికే వెచ్చించే ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని సాక్షాత్తూ కేంద్రమే చెబుతుంటే జగన్ కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. పూర్తిగా ప్రమాదంలో ఆర్థిక వ్యవస్థను ఉంచి ఆయన తరువాత చేతులెత్తేసేలా ఉన్నారు.
మరో ఆర్థిక నేరంలో ఏపీ సర్కారు అధినేత జగన్ ఇరుక్కోనున్నారనే తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడిపేందుకు నిధులు చాలక పోవడం, రావాల్సిన చోట అప్పు పుట్టక పోవడం ఇవన్నీ ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్న పరిణామాలు. ఈ తరుణాన అప్పులు చేయడం తీర్చడం అన్నవి ఆయనకు పెద్ద గుదిబండగా మారాయి. ఉన్నంతలో ప్రభుత్వాన్ని సాఫీగా నడపడం అన్నది కష్టతరంగానూ క్లిష్టతరంగానూ ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక కొన్ని నిబంధనలను జీఓలను అడ్డు పెట్టుకుని అతి పెద్ద ఆర్థిక నేరానికి పాల్పడబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పేరిట అన్ని ప్రభుత్వ నిధులు జమ కావాలని, వివిధ సంస్థలకు చెందిన నిధులన్నీ వివిధ బ్యాంకుల్లో ఉన్నందున వాటినన్నటింనీ ఇక్కడికే బదిలీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇదే కనుక జరిగితే చాలా సంస్థల మనుగడే ప్రమాదకరం కానుంది. దీంతో పలు యూనివర్శిటీలతో సహా వివిధ ట్రస్టుల నిధులు కూడా కార్పొరేషన్ కే బదిలీ చేయాలన్నది ప్రధాన సారాంశంగా జగన్ చెబుతున్న మాట. ఇదే కనుక జరిగితే ఇప్పుడు బదిలీ అయిన నిధులేవీ వెనక్కు వస్తాయన్న గ్యారెంటీ లేదు. దీంతో ప్రభుత్వంను నమ్మి తాము ఇచ్చామని చెప్పినా రేపటి వేళ అందరి భవిష్యత్తూ అంధకారం కానుంది.