ఫ్యాన్ ఆంధ్రా : 2 లక్షల కోట్లకు లెక్కలే లేవు!
ఆంధ్రావనికి త్వరలో విపరీతం అయిన ఆర్థిక కష్టాలు రానున్నాయి. మరోసారి పన్నులు పెరిగిపోతాయి. అప్పులు తీరక లేదా తీర్చలేక ప్రభుత్వ ఆస్తులు అన్నీ అమ్ముడయిపోతాయి. ఇప్పటికే విశాఖలో విలువయిన ఆస్తులు తనఖాకు ఉంచి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరో వెయ్యి కోట్లు కూడా అప్పు రూపంలో తీసుకునేందుకు మార్గం అప్పట్లోనే సుగమం అయింది. ఇదంతా ఎస్బీఐ కేంద్రంగా నడిచిన కథ. ఇప్పుడు ఆ కథ అంతా మరిచిపోయారు. తెచ్చిన రుపాయికి లెక్క చూపడంలో ఏసీ సర్కారు నిర్లక్ష్య వైఖరిలో ఉందని, ఇదెంత మాత్రం తగదని కాగ్ అంటోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా జగన్ తన మొండి వైఖరిని యథేచ్ఛగా పాటిస్తున్నారు.
ఇప్పటిదాకా అప్పు మూడు లక్షల కోట్లకు పైనే
రాబోయే ఏడేళ్లలో తీర్చాల్సిన అప్పు లక్ష కోట్ల పైనే
అయినా కూడా చీమ కుట్టిన విధంగా కూడా ఉండదు.
కాగ్ చెబుతున్న ప్రకారం ప్రభుత్వం గ్యారెంటి ఇచ్చి కొంత ఇవ్వకుండా కొంత తీసుకున్న రుణాలకు లెక్కా పత్రం అన్నది లేకుండా పోయిందని తెలుస్తోంది. ఈ విధంగా రెండు లక్షల కోట్లకు లెక్కలే లేవు. ఈ విధంగా తీసుకున్న అప్పును ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. గతంలో కన్నా ఎక్కువగానే అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్న వైసీపీ సర్కారుకు కొత్త అప్పు ఇక పుట్టదు. అందుకే ఎఫ్ఆర్బీఎంను కూడా సవరించేశారు. ఈ తరుణంలో అప్పులన్నీ ఏమయిపోతున్నాయి.
నిత్యం లక్ష కోట్ల రూపాయలతో సంక్షేమం చేపడుతున్నామని చెప్పే వైసీపీ సర్కారు ఆ విధంగా తీసుకుంటున్న ఏ చర్య అయినా సత్ఫలితం ఇస్తుందని భావిస్తోందా? ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్తున్నాయా లేదా అనర్హుల జేబుల్లోకి వెళ్తున్నాయా అన్నది ఆరా తీయాలి. కానీ అవేవీ లేకుండా తరుచూ అప్పులు తెచ్చేందుకే నానా పాట్లూ పడుతూ, అప్పుల కోసమే ప్రత్యేక సలహాదారులను నియమించుకుంటూ గడ్డు కాలం నుంచి ఒడ్డెక్కాలని భావించడం తగని పని!