బాబోయ్ బాబాయ్ : అంత మంచివాడా? ఎవ్వడినీ కొట్టడా?
ఇంకా చెప్పాలంటే...
ఈ ఏడాది అఖండ నామ సంవత్సరం కానుంది. అలాంటి ధీమాతో ఉన్నారు బాలయ్య. ఎన్నడూ లేని విధంగా ట్రైలర్ కు మంచి స్పందన ఉంది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా నడిచిందనే టాక్ ఉంది. ఇక హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అయితే బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఇంతకూ ఎప్పుడూ కోపంతోనో ఆవేశంతోనో ఊగిపోయే పాత్రలను పోషించే బాలయ్య సెట్లో ఎలా ఉంటారు? అంటే అందుకు సమాధానం బోయపాటినే చెప్పాలి. లేదా ప్రజ్ఞానే చెప్పాలి. వాస్తవానికి ప్రథమ కోపం కానీ ప్రథమ ఆవేశం కానీ ఉండే వ్యక్తులు కాస్త నిగ్రహం కోల్పోయే ఉంటారు. సెట్లో ఆయన క్రమశిక్షణ తప్పి ఉండరు. ఉండాలనుకోరు. ఆ విధంగా ఎవ్వరయినా ప్రవర్తిస్తే ఒప్పుకోరు. ఆయా సందర్భాల్లో చాలా మందిపై ఆయన సీరియస్ అయ్యారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. కొందరిని కొట్టారు కూడా! ఆవేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో కొందరిని ఆయన శారీరకంగా, మానసి కంగా బాధపెట్టారు కూడా! అయినప్పటికీ బాలయ్యను ప్రేమించే వాళ్లకు,ఆయన మనస్తత్వం తెలిసిన వారికి మాత్రం వీటన్నింటి నుంచి మినహాయింపు ఉంటుంది.