తెలంగాణ రైతులకు వెరీ బ్యాడ్ న్యూస్..?

Chakravarthi Kalyan
తెలంగాణలో ప్రస్తుతం వడ్ల పంచాయతీ నడుస్తోంది. పుష్కలంగా వరి పంట పండినా దాన్ని కొనేవాళ్లు కరవయ్యారు. కేంద్రం కొనడానికి ఒప్పుకున్న ప్రసుతం వానాకాలం పంట కొనడానికే ఇబ్బందిగా ఉంటే.. కొనం మొర్రో అంటున్న యాసంగి పంట సంగతేంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి వడ్లు కొనాలంటూ టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న ఒత్తిడి కేంద్రంపై అంతగా పని చేయడం లేదనే చెప్పారు. ఇందుకు ఉదాహరణగా కేంద్రమంత్రితో తెలంగాణ మంత్రులు జరిపిన సమావేశాన్ని చెప్పుకోవచ్చు.

కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రులు శుక్రవారం రాత్రి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. యాసంగి వడ్లు కొనేందుకు సిద్ధంగా లేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఏడాదికి ఎంత సేకరిస్తారో చెప్పడం అసాధ్యం అని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో నిరాశతోనే వెను తిరిగన తెలంగాణ మంత్రులు.. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెపుతోంది.. కానీ, స్థానిక బీజేపీ నేతలు వరి వేయాలని చూపుతున్నారని కేంద్ర మంత్రికి చెప్పామని తెలిపారు. వాళ్లకు కూడా ఇప్పుడు చెపుతున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  సమర్థించుకున్నారు.

తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిని కలిశామమన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. మేము చాలా ఆశతో ఈ సమావేశానికి వచ్చామని... కానీ కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని తెలిపారు. అసంపూర్తిగా సమావేశం ముగిసిందని.. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదని మంత్రి తెలిపారు. గత వారం ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు అని మంత్రి వివరించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని.. సంవత్సరానికి ఎంత కొంటారు చెప్పాలని కేంద్రాన్ని అడిగామని మంత్రి తెలిపారు.

అయితే.. ఎంత కొంటామో ముందస్తుగా అంచనావేసి చెప్పడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఒక కమిటీ వేస్తామని.. ఆ కమిటీలో రైతులు ఏ పంట వేయాలి కమిటీ నిర్ణయిస్తుందని కేంద్రం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: