నారా భువనేశ్వరి ఇష్యూలోకి కవిత, షర్మిల..?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలోనే వెక్కి వెక్కి ఏడ్వడంతో నారా భువనేశ్వరిపై వ్యాఖ్యల అంశం బాగా చర్చనీయాంశమైంది. అసలు చంద్రబాబు ఎందుకు ఏడ్చారు.. నారా భువనేశ్వరిని ఎవరు ఏమన్నారు.. అనే అంశాలపై చర్చ జరిగింది. అయితే ఇప్పుటికీ తాము అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు అంటుంటారు.. మరి అసలు అన్నారా లేదా.. అన్నది వారికే తెలియాలి. అయితే... అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేలు మైక్ ముందు కాకుండా.. సీట్లలో నుంచి కూడా గోల గోలగా అరుస్తుంటారు. అలా అరిచే సమయంలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది టీడీపీ ఆరోపణ.

అయితే.. ఈ అంశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడంతో బాగా ప్రాచుర్యం లభించింది. చంద్రబాబును ఇప్పటికే జాతీయ స్థాయిలో నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. రజినీకాంత్‌, మైత్రేయన్, సోనూసూద్ వంటి వారు కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేక రంగాలకు చెందిన వారు వైసీపీ నేతల తీరును ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టం అంటూ ఖండన ప్రకటనలు చేశారు.

అలా ఖండన ప్రకటనలు చేసిన వారిలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. అయితే ఆమె ఘటనను కేవలం ఖండించి వదిలేయకుండా దీన్ని టీఆర్ఎస్ నేత కవితకూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకూ లింకు పెడుతున్నారు. ఇంత దారుణం జరిగితే షర్మిల, కవిత స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలంటున్న కొండా సురేఖ.. భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తనను కలిచి వేశాయన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా దీనిపై స్పందించాలని కొండా సురేఖ అంటున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం బాధ కలిగించిందంటున్నారు కొండా సురేఖ. తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా  కేటీఆర్ కనీసం సోషల్ మీడియాలోనూ పోస్టు పెట్టలేదని కొండా సురేఖ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: