అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?

praveen
కరోనా వైరస్ మూడవ  దశ మొదలైందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే అగ్రరాజ్యాల లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక అన్ని రకాల ఆంక్షలను  ఎత్తివేసిన  దేశాలు ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం... అటు మరణాల సంఖ్య కూడా పెరిగి పోతూ ఉండడంతో మళ్ళీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీ, చైనా, బ్రిటన్, రష్యా దేశాలలో ఒక రేంజ్ లో కేసులు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇక ఆయా దేశాలలో మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులు వస్తున్నాయి. ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో మిగతా దేశాలలో కూడా మూడవ దశ కరోనా వైరస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.  శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మొన్నటి వరకు జర్మనీ, చైనా, బ్రిటన్, రష్యా లలో మాత్రమే కేసులు విపరీతంగా పెరిగాయి ఇటీవలే ఆస్ట్రీయాలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ 15 వేలకు పైగానే కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండడం గమనార్హం.



 దీంతో ఇక కరోనా వైరస్ కేసులను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడం మొదలు పెట్టింది. ఇక ఇటీవల నవంబర్ 22 వ తేదీ నుంచి పది రోజుల వరకు కూడా లాక్ డౌన్ విధించాలి అంటూ అక్కడి ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రభుత్వం విధించిన నిబంధనను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించింది. ఎవరైనా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడం కారణంగానే  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది అంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక కేసులు భారీగా పెరిగి పోతుండటంతో అందరిలో భయం పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: