టీఢీపీ : ఒప్పుల "కుప్పం" ఇదేనా! దేవుడా!
తప్పులెన్నో చేశాడు బాబు. తప్పులెన్నో చేయించాడు దేవుడు. బాబు ఏమౌతాడు ఇప్పుడు. తెలియదు? పాపం దేవదేవుడయి నా ఆయనకు ఇప్పటికిప్పుడు సాయం చేయకపోతాడా? ఇదే నమ్మకంతో అంతా ఉండాలి. అంతా అందరూ అని కాదు టీడీపీ శ్రేణులు మరియు టీడీపీ నాయకులు అని అర్థంలో అంటున్నానీ మాట. అంతా అంటే చంద్రబాబుతో సహా అంతా అని అర్థం! అంతా అంటే జగమంతా కాదు పసుపు వనమంతా అని అర్థంలో అంటున్నానీ మాట. ఏ మాటకు ఆ మాట గెలిచేది నేనే గెలిపించేది నేనే! అని ఆ రోజు అనగా ఎన్నికల ముందు రోజు వరకూ కూడా చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పారు అంటే చంద్రబాబు చెప్పారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారితో లోపలి మనిషి చెప్పించాడు. ఆయనతో పాటు ఇంకొన్ని శక్తులు కూడా కూడి ఈ మాట చెప్పాయి మరియు చెప్పించాయి. పాపం! ఓడిపోయిన చంద్రబాబు కొత్త దారి వెతుక్కునే పనిలో పడ్డారు. అందుకే తనకు దగ్గరగా ఉండే సుజనా ను బీజేపీలోకి పంపారు. సీఎం రమేశ్ ను అదే గూటికి చేర్చుకునేలా చేశారు. ఆఖరికి సీమ పెద్దాయన అయి టీజీ వెంకటేశ్ ను కూడా ఆ పార్టీనే కలుపుకోలేక కలుపుకుంది.
వాస్తవానికి ఇప్పుడు టీజీ వెంకటేశ్ కన్నా భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు భైరెడ్డి శబరి బాగా మాట్లాడగలుగుతున్నారు. ఆమె తన తరఫు గొంతుకను ప్రజా సమస్యల కోసం గట్టిగానే వినిపించగలుగుతున్నారు. ఈ పాటి పని కూడా చంద్రబాబు కానీ చంద్రబాబు పంపిన మనుషులు కానీ చేయలేకపోతున్నారు. అందుకే టీడీపీ ఎక్కడా అనుకున్నంతగా ప్రభావశీలకంగా అటు సీమలోనూ ఇటు కోస్తాలోనూ ఆ మాటకు వస్తే మా ఉత్తరాంధ్ర లోనూ (కంచుకోట అంటారు లేండి మా ప్రాంతం టీడీపీకి అని) పనిచేయలేపోతున్నారు. పనిచేయలేకే చతికిల పడుతున్నారు. పనిచేయలేకే అవస్థ పడుతున్నారు. రాజకీయం అనే పెద్ద పని రాని కారణంగా కాదు పని వచ్చినా పనికి వచ్చిన మాటలు జనం కోసం వినిపించడం చేతగాక! ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక కుప్పం రాజకీయానికి వస్తే చంద్రబాబు అనుకున్నంతగా ఈ గేమ్ ఆడలేకపోయాడు. కాదు కాదు ఆట మధ్యలోనే వదిలేసి ఎక్కడో దూరం నుంచి చూస్తూ తానే ఒక రిఫరీ అని భావిస్తున్నాడు. కానీ ఈ ఆటకు కోచ్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన మాత్రమే ఈ ఆటను బాగా ఆడించగలడు అన్నది తేలిపోయింది. ఆటకు విసుగు విరామం అన్నవి ఉండకూడదు. ఎందుకంటే ఇది పొలిటికల్ గేమ్ కనుక! ఒక్కసారి విసిగిపోయినా నాకెందుకు అని పక్కకు తొలగిపోయినా ఓటమి అన్నది చావు దెబ్బ కొడుతుంది. ఆ పాటి కూడా తెలుసుకోకుండా పిల్లాడయినా జగన్ తో ఎందుకని కయ్యం పెట్టుకున్నాడో బాబు. అందుకనో ఎందుకనో పిల్లాడయిన జగన్ కు ఇంకా చెప్పాలంటే ఆయన సామాజికవర్గానికి చేరువగా పనిచేస్తున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ పాటి ముందు జాగ్రత్త ఉన్న కారణంగానే కొన్ని సార్లయినా కేసీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అన్నివేళలా కాకపోయినా కొన్ని సార్లు అయినా అదే కేసీఆర్ కు ఆంధ్రావని లో కూడా పొగడ్తలు వస్తున్నాయి. కానీ జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం నడిపిన చంద్రబాబు మాత్రం ఇప్పట్లో ఆశించిన లేదా ఊహించిన లేదా అంచనా తూగిన ఫలితాలు అందుకోవడం అన్నది జరగని పని అని నిన్నటి వేళ తేలిపోయింది. రేపటి వేళ ఇదే రుజువు కానుంది.