టీడీపీ కోసం జనసేన త్యాగం..బాగానే సెట్ చేసుకున్నారు!

M N Amaleswara rao
టీడీపీ-జనసేనల ఫ్రెండ్‌షిప్ సైలెంట్‌గా ముందుకెళుతుంది..2014 నుంచి వీరి స్నేహం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యలో మధ్యలో కాస్త తేడాలు వచ్చినా సరే...పూర్తిగా అయితే వీరి స్నేహం తెగిపోలేదు. ఇప్పుడు జగన్‌కు చెక్ పెట్టడం కోసం టీడీపీ-జనసేనలు కలిసి ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాకపోతే అధికారికంగా వీరి స్నేహం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కానీ అనధికారికంగా మాత్రం వీరి స్నేహం ముందుకెళ్తుందనే చెప్పాలి. గత ఎం‌పి‌టి‌సి, జెడ్‌టి‌పి‌సి ఎన్నికల సమయంలోనే వీరి స్నేహం బయటపడింది.
ఇప్పుడు కూడా మిగిలిన స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో కూడా వీరి స్నేహం పరోక్షంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీ-జనసేనల పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీకి చెక్ పెట్టడానికి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇలా పలు చోట్ల రెండు పార్టీలు కలిసి బరిలో దిగుతున్నాయి. అలాగే కొన్ని జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి సపోర్ట్ ఇస్తుంది.
పెడన నియోజకవర్గంలోని పెడన జెడ్పీటీసీ స్థానంలో అదే సీన్ జరుగుతుంది. ఇక్కడ వైసీపీని నిలువరించడానికి జనసేన పోటీ నుంచి తప్పుకుంది...పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే జనసేన గానీ బరిలో ఉంటే టీడీపీకే డ్యామేజ్ జరిగేది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో జనసేన ఓట్లు చీల్చి టీడీపీకి నష్టం చేసి, వైసీపీకి బెనిఫిట్ చేసింది.
ఇప్పుడు పెడన జెడ్పీటీసీ స్థానంలో జనసేన పోటీ చేస్తే అదే పరిస్తితి అయ్యేది. అందుకనే జనసేన పోటీలో లేకుండా తప్పుకుంది...దీంతో టీడీపీకి ప్లస్ కానుంది. ఇక ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్ పడేలా ఉంది. కానీ వైసీపీకి అధికార బలం ఉంది కాబట్టి, పెడనలో ఫలితం ఎలాగైనా రావొచ్చు. చూడాలి మరి టీడీపీ-జనసేనల పొత్తు ఏ మేర వర్కౌట్ అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: