కొడుక్కి గుండెపోటు.. తల్లి గుండె ఆగింది?
ఇక్కడ పోలీస్ అధి కారిగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఒక పెళ్లి కొడుకు చేసేందుకు నిర్ణయించాడు. ఈ క్రమం లోనే పెళ్లి సంబంధం కూడా సెట్ అయింది పెళ్లి ముహూర్తం కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమం లోనే బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషుల మధ్య అంగరంగ వైభవం గా కొడుకు వివాహం జరిపించాడు. ఇక మండపం మొత్తం పెళ్లి సందడి నెలకొనగా అందరూ ఎంతో సంతోషం గా ఉన్నారు. కానీ అంతలో ఊహించని ఘటన అప్పటి వరకు కొడుకు పెళ్లి ఎంతో సంతోషం గా జరిపించిన తండ్రి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు పెళ్లి అయిన వెంటనే గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది..
అప్పుడు వరకు పెళ్లి బాజాల తో కళకళ లాడిన ఆ ఇంట్లో అంతలోనే విషాదఛాయలు అలుముకున్నాయి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు మండలంలో క్షణాల వ్యవధిలోనే తల్లి, కొడుకులు మరణించడం అందరిని కంటతడి పెట్టించింది. పామిడి ఏఎస్సైగా పనిచేస్తున్న వెంకటస్వామి ఇటీవలే కొడుకు పెళ్లి జరిపించాడు. అయితే పెళ్లైన వెంటనే గుండెపోటుతో మరణించాడు వెంకటస్వామి. కొడుకు మరణవార్త తెలిసిన వెంకటస్వామి తల్లి కొండమ్మ గుండె ఆగిపోయింది. ఇక ఈ రెండు మరణాలతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక అధికారిక లాంఛనాలతో వీరికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు పోలీస్ అధికారులు.