జగన్, కేసీఆర్‌.. ఇద్దరూ ఇద్దరే.. దయలేని సీఎంలు..?

Chakravarthi Kalyan
దేశంలో పెట్రోల్‌ ధరలు పాపంలా పెరిగిపోతున్నాయి. రోజూ 30, 40 పైసల చొప్పున బాదుడు నిత్య కృత్యం అయ్యింది. దీంతో క్రమంగా తెలియకుండానే పెట్రోల్ ధరలు వంద దాటేశాయి.. నిన్న మొన్నటి వరకూ 114 రూపాయల వరకూ లీటర్ పెట్రోల్ వెళ్లింది.. ఈ ధరలు ఇలాగే పెరుగుకుంటూ వెళ్తే.. పెట్రోల్ రేట్లు త్వరలోనే 150 రూపాయలు చేరడం ఖాయమన్న ఆందోళన చాలా మందిలో కనిపించింది. పెట్రోల్ రేట్లు పెరిగాయంటే.. దేశంలో అన్ని వస్తువులు, సేవల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి.


అలా సామాన్యుని జీవితం దుర్భరమైంది. దీంతో కేంద్రం ఏమనుకుందో ఏమో కానీ.. సామాన్యుడిని కాస్త కనికరించింది. తన పన్నుల్లో కొంత మినహాయించుకుని పెట్రోల్ ధర రూ. 5, డీజిల్ ధర రూ. 10 రూపాయల వరకూ తగ్గించింది. అంతే కాదు.. రాష్ట్రాలు కూడా తన బాటలో నడిచి సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని సూచించింది. కేంద్రం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో దేశ ప్రజలు కాస్త ఊరట చెందారు. అలాగే కేంద్రం చెప్పిన మాట విని రాష్ట్రాలు కూడా కాస్త కనికరిస్తాయని దేశ ప్రజలు ఆనంద పడ్డారు.


అయితే మోడీ పిలుపుతో దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలపై కాస్త ఆలోచనలో పడ్డాయి. కేంద్రమే తన ఆదాయం తగ్గించుకుని సామాన్యుడికి కాస్త భారం తగ్గించినందుకు తాము కూడా అదే బాటలో నడుస్తామని చాలా రాష్ట్రాలు ముందుకొచ్చాయి. వాటిలో తమ శక్తి మేరకు పెట్రో ధరలను తగ్గించాయి. అయితే కొందరు సీఎంలు మాత్రం పెట్రో ధరల్లో రాష్ట్ర పన్నుల వాటా తగ్గించుకునేందుకు ముందుకు రావడం లేదు.


అలాంటి ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎంలు ఇద్దరూ ఉన్నారు. ఇటు కేసీఆర్ కానీ.. అటు జగన్ కానీ.. ఇప్పుడు పెట్రోల్ ధరలను తగ్గించాలన్న ఆలోచన చేయడం లేదు. కేంద్రం తరహాలోనే తాము కూడా కాస్త పన్ను ఊరట ఇస్తే.. కాస్త ఊపిరిపీల్చుకోవనుకున్న సామాన్యుడికి మాత్రం ఇంకా స్వాంతన కరవైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: