నోర్ముయండ్రా మళ్లీ సమైక్యాంధ్ర ఎలా వస్తాది?
నోటికి వచ్చిందంతా మాట్లాడడంలోనే గొప్ప పనితనం ఉందా? లేదా అంతకుమించి జరిగేది ఏమయినా ఉంటుందా? 2 రాష్ట్రాలుగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్లీ కలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు కాదు ఏం వాగుతున్నారు? వాగేదంతా మీ మంచికే వాగుతున్నారా? లేదా ప్రజల మంచికై వాగుతున్నారా? అవును ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఎవరి దారి వారుచూస్తున్నారు. కేంద్రం కూడా ఎవరికి ఇవ్వాల్సిన వారికి ఇస్తూనే ఉంది. ఏడేళ్ల కాల గతిలో మంచి మార్పులు వచ్చాయి. కొన్ని అనుకోని ఘటనలు కూడా జరిగాయి. ఇవన్నీ వదిలి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమ తమ రీతుల్లో ఎదిగేందుకు చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం అయిందని చెప్పలేం కానీ కొన్ని విషయాల్లో ఆంధ్రా, మరికొన్ని విషయాల్లో తెలంగాణ తమదైన ప్రగతి సాధిస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఒకటి అందుకున్నాడు. అదే ఇప్పుడు తలనొప్పిగా ఉంది. తెలంగాణ ప్లీనరీ వేదికపై తెలుగు తల్లి బొమ్మ ఉంచడంపై జరుగుతున్న రాద్ధాంతంలో తాజాగా తన జాగా చూసుకుని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాట్లాడనివ్వండి ఎవ్వరూ కాదనరు.. ఆయనొక పీసీసీ చీఫ్. కానీ ఇలాంటి అవివేకం అయిన మాటలు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం అన్నది గులాబీ దండు నుంచి వస్తున్న ప్రశ్న. కేసీఆర్ మరియు జగన్ కలిసి సమైక్యాంధ్ర దిశగా పనిచేస్తున్నారని ఆరోపించడం ఎందాక సబబు అన్నది గులాబీ దండు నుంచి వస్తున్న మరో ప్రశ్న. వీటిపై రేవంత్ రెడ్డి స్పందిస్తారా?