వదల బొమ్మాలి వదలా.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్?
అణు బాంబులు తయారు చేసేందుకు ఇరాన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ ప్లాన్ ను దెబ్బ కొడుతూనే ఉంది ఇక ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కాదు చేతల యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ఎంతో వ్యూహాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇరాన్కు చెందిన అణు శాస్త్రవేత్త ను హత్య చేసిన విషయం కూడా ప్రపంచం ఎరిగినదే. అంతేకాదు ఇరాన్ లో ఉన్న అణు కర్మాగారాల పై కూడా పలుమార్లు దాడి చేసి ధ్వంసం చేసింది ఇజ్రాయిల్. ఇలా ఇరాన్ అణు బాంబులు తయారు చేయకుండా ఉండేలా ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉంటుంది ఇజ్రాయిల్.
ఇక ఇప్పుడు మరో సారి ఇరాన్ కి నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయిల్. ఇరాన్ మళ్లీ అణుబాంబులు తయారు చేయాలని ప్రయత్నిస్తే తాము మాత్రం ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంటాము అంటూ ప్రకటించింది. అవసరమైతే ఇరాన్తో యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అంటూ స్పష్టంగా తెలిపింది. తీవ్రవాదులు ఉన్న ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండడాన్ని అంగీకరించబోమని అంటూ తెలిపింది. ఇజ్రాయిల్ ఇలాంటి ప్రకటన చేయగా అటు ఇజ్రాయిల్ కు సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటూ అమెరికా కూడా చెబుతుంది. దీని కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించామని.. ఇరాన్ దగ్గర అణు బాంబులు ఉండడాన్నీ అసలు సహించబోమని అంటూ అమెరికా కూడా చెబుతుండడంతో.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.