సిట్టింగ్ సీట్లలో టీడీపీ హ్యాండ్సప్..రెండు అవుట్?

M N Amaleswara rao
గత ఎన్నికల్లో టీడీపీకి ప్రతి జిల్లాల్లోనూ దారుణమైన ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొద్దో గొప్పో...ప్రకాశం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగేసి సీట్లు వచ్చాయి. తూర్పు, విశాఖలని పక్కనబెడితే ప్రకాశంలో టీడీపీ నాలుగు సీట్లు గెలవడం గొప్ప విషయమే అని చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 5 సీట్లలో మాత్రమే గెలిచింది. అప్పుడు టీడీపీ గాలి ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఫుల్ గా వైసీపీ గాలి అయినా సరే టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది...ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావొస్తుంది...మరి రెండున్నర ఏళ్ల సమయంలో టీడీపీ గెలిచిన నాలుగు సీట్లలో పట్టు నిలుపుకుందా? లేక పట్టు కోల్పోయిందా? అనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే...గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన సీట్లు వచ్చి...పర్చూరు, అద్దంకి, కొండపి, చీరాల. 2014 ఎన్నికల్లో పర్చూరు, అద్దంకి, కొండపి సీట్లలో గెలిచింది...మళ్ళీ అదే సీట్లలో టీడీపీ గెలవడం గొప్ప విషయమే అంటే ఆ ఎమ్మెల్యేల పనితీరు బాగుంది కాబట్టే ప్రజలు మళ్ళీ గెలిపించుకున్నారని చెప్పాలి.
అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మళ్ళీ వారికి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే పర్చూరు, అద్దంకి సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేల బలం పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌ల పనితీరు బాగానే ఉంది..ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే వీరు..ప్రజలకు అండగానే ఉంటున్నారు. అందుకే ఈ రెండు సీట్లలో టీడీపీ బలం తగ్గలేదు.
అయితే కొండపిలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి బలం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీ బలం పెంచుకున్నట్లు తెలుస్తోంది. అటు చీరాలలో గెలిచిన కరణం బలరాం ఎలాగో వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు...దీంతో అక్కడ టీడీపీ బలం పూర్తిగా తగ్గిపోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీకి...కొండపి, చీరాల నియోజకవర్గాలు డౌట్ అనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: