చంద్రబాబు డిల్లీకి ఎందుకు పోతున్నాడో మాకు అర్ధం కావడంలేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ను బూతులతో తిట్టానని ఫిర్యాదు చేయడానికి వెలుతున్నాడా..? లేక టీడీపీ ఆఫీస్ ను పగలగొట్టారని ఫిర్యాదు చేయడానికి వెలుతున్నాడా..? అంటూ ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ ను మా దేవాలయం అంటున్న చంద్రబాబు అదే దేవాలయాన్ని నిర్మించిన ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అటువంటి చరిత్రగల వ్యక్తి డిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తాడో మాకు తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర గురించి టీడీపీ ఎమ్మెల్యేలే వచ్చి చెబుతుంటే వినాలంటేనే అసభ్యంగా ఉందంటూ చెప్పారు.
జూమ్ యాపులో కూర్చోని ఎదో చేయడం తప్ప చంద్రబాబుకు పనిపాట లేదు అందుకే డిల్లీ వెల్లీ రెండు రోజులు తిరిగివప్తాడు అక్కడ స్పందించే వారేలేరు అంటూ బాలినేని సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ రాళ్లతో అమిత్ షాను కొట్టించిన వ్యక్తికి అపాయిన్ట్ మెంట్ ఎలా ఇస్తారో మాకైతే తెలియదంటూ బాలినేని ఆరోపించారు. 14సంవత్సరాలు సిఎంగా చేశాడు కాబట్టి చంద్రబాబుకు రాష్ట్ర పతి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు...కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ మాత్రం చంద్రబాబుకు దొరకలేదంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదంటున్న చంద్రబాబు సానుబూతికోసం ప్రయత్నిస్తున్నాడంటూ బాలినేని వ్యాఖ్యానించారు.
దాడిచేసిన వారు పలానా వాలానా అన్నారని ...ఫిర్యాదు చేసి వారి పేర్లు ఎందుకు ఇవ్వలేక పోయాడు అంటూ ప్రశ్నించారు. వారే ధాడి చేసుకుని మళ్లీ వారే కేసులు పెట్టుకుంటుంటారు వారి చరిత్రమొత్తం అంతే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సిఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలులేదన్న వ్యక్తి ఈ రోజు సీబీఐతో విచారణ చేయాలని ఎలా అడుగుతున్నాడు తనకోనీతి వేరే వారికో నీతా అంటూ చంద్రబాబును బాలినేని ప్రశ్నించారు. ఆయన అన్న ఈ వ్యాఖ్యలను వినిపించేందుకు మేము సిద్దమని...చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు మరోసారి సిద్దంగా ఉన్నారంటూ బాలినేని వ్యాఖ్యానించారు.