జగన్ ఇలాకా : పెద్ద కోరికే కోరాడు ఏపీ సీఎం!
ఇంకొందరు ఇతర పార్టీల నాయకులు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే గతంలో రెడ్డి శాంతి ఆయనపై పోటీ చేసి ఓడిపోయారు. కాపు సామాజికవర్గంకు చెందిన నాయకురాలు ఆమె. ఇంకా చెప్పాలంటే జిల్లాలో మంచి పట్టున్న సామాజికవర్గంకు చెందిన ప్రతినిధి ఆమె. అయినప్పటికీ జనం ఆమెను విశ్వసించలేదు. ఇంకొకరు మొన్నటి ఎన్నికల్లో రామూ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయనే దువ్వాడ శ్రీను. ఈయన కూడా పార్టీ పై కుల రాజకీయాలపై మంచి పట్టున్న నాయకుడే కానీ ఓడిపోయారు. రామూ పై మొదటి సారి ఓడిపోయిన రెడ్డి శాంతి ఈ సారి మళ్లీ ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నారు అని సమాచారం. కానీ ఆమెకు ఇవ్వరని తెలుస్తోంది. మరో నాయకురాలు కిల్లి కృపారాణి కూడా తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలని ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నా రు. ఈమె కేంద్ర మాజీ మంత్రి.
ఈమె కూడా రామూ పై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆలోచిస్తున్నారు. ఇదే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కూడా మరో సారి రామూ పై పోటీ చేయాలని యోచిస్తున్నారని సమాచారం. మరి! ఈ నలుగురిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో?
వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని రావాలని పెద్ద కోరికే కోరాడు జగన్ తన అనుచర వర్గాన్ని..విధేయ వర్గాన్ని కూడా! అయితే అదేమంత సులువు కాదని తేల్చేశారు శ్రీకాకుళం పార్టీ నాయకులు. గతంలో రెండు సార్లు ఇలానే ప్రయత్నించి ఓడిపోయామని కూడా మరో సారి గుర్తు చేశారు. పార్టీ మాత్రం ఈ సారి ఎలా అయినా టెక్కలి అసెంబ్లీ స్థానంతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా గెలవాలని వీలుంటే రాజమండ్రిలో ఎర్రన్న కుమార్తె భవానీని కూడా ఓడించాలని యోచిస్తున్నారు జగన్. ఒకే కుటుంబాన్ని ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వైసీపీ హవా బాగా ఉన్న రోజుల్లో కూడా టీడీపీ తరఫున వీళ్లంతా సునాయాసంగా గెలిచి రావడమే! తాజా పరిణామాల నేపథ్యంలో రామూను ఓడించేందుకు అదే సామాజికవర్గం కు చెందిన నేత ధర్మాన కృష్ణదాసును రంగంలోకి దింపేందుకు కారణం కూడా ఇదే! కానీ ఇది అనుకున్నంత సులువు కాదు.