బి.ఎస్.ఎఫ్. : సరిహద్దులకు.. మరిన్ని అధికారాలు..!

Chandrasekhar Reddy
సరిహద్దులలో పహారా కాసే వాళ్ళ అధికారాలను విస్తృతం చేసింది కేంద్రప్రభుత్వం. తాజాగా సరిహద్దులలో తీవ్రంగా చొరబాటులకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్ ఆక్రమణ అనంతరం సరిహద్దులలో పాక్ ప్రేరేపిత ఉగ్రభూతాల చొరబాట్లు అధికంగా ఉంటున్నాయి. పాక్, తాలిబన్ ల అండ చూసుకొని ఆయా తీవ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ ను కూడా పనిలోకి దింపుతోంది. మరోపక్క సరిహద్దులలో డ్రోన్ సహా పలు మార్గాల ద్వారా ఆయుధాలు, చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల సరిహద్దులలో ఇలాంటి చొరబాట్లు ఉండటం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చొరబాట్లు ఇంకా పెరుగుతాయనే నిఘా సంస్థల హెచ్చరికలతో అక్కడ నిత్యం పహారా కాసే రక్షణ దళానికి అధికారాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
గతంలో సరిహద్దులలో పనిచేసే రక్షణ దళం ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగేది. అయితే ఈ పట్టుబడ్డ వాళ్లకు మరియు పోలీసులకు ఉన్న సత్సంబందాలతో నేరస్తులు లేదా తీవ్రవాదులు తేలికగా బెయిల్ లాంటి వాటితో బయటకు వచేస్తున్నారు, తమపని పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నారు. దానివలన రక్షణ వ్యవస్థలో భారీగా లోటు జారుతుంది. చొరబాట్లు అధికం అవుతున్నాయి. ఈ సరిహద్దు సైన్యానికి కూడా గతంలో 15 కిలోమీటర్ల పరిధి ఉండేది. ఆ పరిధిలో ఖైదు చేయడం, విచారించడం లాంటివి కుదరని పని, అందుకే స్థానిక పోలీసులకు అప్పగించేవారు.
అయితే ప్రస్తుత విస్తృత అధికారాల నేపథ్యంలో వీరి పరిధి 50 కిలోమీటర్ల వరకు పెంచారు. అంటే ఆ పరిధిలో ఏమి జరిగినా వాళ్ళే బాధ్యత వహించి, తప్పు జరగకుండా చూసుకోవడం సాధ్యం అవుతుంది. ఇటీవల చొరబాట్ల ను పరిగణ లోకి తీసుకోని, అలాగే సరిహద్దుల ద్వారా ఏదైనా అక్రమ రవాణా చేస్తున్నా కూడా చూసి చూడనట్టు ఉండే పరిస్థితిని పరిగణలోకి తీసుకోని ఈ కొత్త అధికారాలను జారీచేసింది ప్రభుత్వం. కేవలం సరిహద్దులలో రక్షణగా మాత్రమే కాకుండా ఇకమీదట శిక్షించే అధికారం కూడా వారికి ఇవ్వబడింది. అయితే దానిని వాళ్ళు కూడా దుర్వినియోగం చేయకుండా ఉంటె మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsf

సంబంధిత వార్తలు: