బీ అలర్ట్ : సజ్జల చెప్పినా వినని ఉద్యోగులు!
కొత్త పీఆర్సీపై స్పష్టత వచ్చింది. అయితే ఇదొక్కటే కాదు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి అని ఉద్యోగులు చె బుతున్నారు. ముఖ్యంగా తాము దాచుకున్న సొమ్మును వేరే పనుల కోసం వెచ్చించడం అస్సలు తగని పని అని చాలా మంది వాపోతున్నారు. జీపీఎఫ్ నుంచి లోన్ రూపేణా ఎంతో కొంత తీసుకుందామనుకున్నా ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పనిలా లేనే లేదు. అదేవిధంగా సీపీఎస్ పై పాదయాత్రలో ఇచ్చిన హామీ గాలికే అని తేలిపోయాక తామేం చేయాలో తోచడం లేదని అంటు న్నారు. ఇవి చాలక ప్రతి నెలా జీతాల చెల్లింపు, పెన్షన్ల చెల్లింపు ఆలస్యం చేస్తూ ఉన్నారని, ఇదెంత మాత్రం తగదని చెబుతున్నా రు. కాంట్రాక్టు ఉద్యోగులకు కుదరినా కుదరకున్నా ఉద్యోగ భద్రత ఇవ్వాలని అడిగినా పట్టించుకోవడం లేదని వేదన చెందుతున్నా రు.
త్వరలో ఉద్యోగులంతా రోడ్డెక్కితే తమ సర్కారు ఏమైపోతుందో అన్న బెంగ సంబంధిత నాయకులను వెన్నాడుతోంది. ఎందుకంటే పీఆర్సీ విషయమై జగన్ ఈ నెలాఖరుకు ఓ స్పష్టత ఇచ్చినా, ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ పరిష్కరిం చాల్సిన బాధ్యత కూడా జగన్ పై ఉంది. ముఖ్యంగా సీపీఎస్ రద్దుకు సంబంధించి ఇప్పటిదాకా ఏ స్పష్టతా ఇవ్వలేదు జగన్ సర్కా ర్. అదేవిధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందిరికే జీతాలు చెల్లిస్తున్నారు. ఇంకొందరికి ఇంకా చెల్లింపులు లేనే లేవు. జీ తాలకు సంబంధించి జరుగుతున్న చెల్లింపులు తాత్కారం అవుతూనే ఉన్నాయి. ఈ సమస్యను సజ్జల రామకృష్ణా రెడ్డి (ప్రభుత్వ సలహాదారు) ఒప్పుకున్నారు కూడా! ఇవన్నీ వివాదాలకు కారణం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సమస్యల పరిష్కారంపై తాము సానుకూలంగా ఉన్నామని చెప్పడం మాత్రం కేవలం ఉద్యోగులను బుజ్జగించడమే అని తేలిపోయింది.