కొండ పొలం : ఆ సీమ కథకు అంత సీన్ ఉందా?
మీకు అభినందనలు మా శ్రీకాకుళం తరఫున..
పెంచల దాసు లాంటి ఓ మంచి కవి బయటకు వచ్చారు. మంచి పాటలు రాశారు. సీమ నుంచి వచ్చిన మంచి కవి అని ఎందరెందరో ప్రశంసించారు. అదేవిధంగా ఆయన పాట రాసిన విధానం ఎంతో బాగుంది కూడా! చిత్తూరు జిల్లా బిడ్డ పెంచల దాసు. అరవంద సమేత వీర రాఘవ కు పనిచేశారు. అంతకుమునుపు మేర్లపాక గాంధీ అనే యువ దర్శకుడు పిలుపు మేరకు దారి చూడు..దుమ్మూ చూడు అనే పల్లవితో పాట రాశారు. ఎంతో బాగుంది ఆ పాట. ఆ కవి ఓ సామాన్యుడు. ఎంత పేరు తెచ్చుకున్నారో అని నేను పొంగిపోయాను. సినిమా అనే మాధ్యమానికి అంత గొప్ప విస్తృతి అనే కాదు విజ్ఞత కూడా ఉంది అని మరో మారు నిరూపించిన పాట అది. ఆ తరువాత ఆయన సినిమాలకు పనిచేశారు. పవన్ నుంచి మంచి అభినందన అందుకున్నారు.
ఇప్పుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. సీఎం సొంత జిల్లా మనిషి. కడపలో ఓ టీచర్ .. తన ఇంటి అరుగు తనకు కథలు చెప్పిందని పొంగిపోయారు. ఆ పుస్తకం ఆయన తన ఇంటి అరుగుకు అంకితం ఇచ్చారు. అవును! తన ప్రాంత కథను, తన అడవి నేపథ్యాలను ఎంత గొప్పగా చెప్పారో ..వచనం బాగుంది అని రాయడం సులువు.. బాగున్న వచనంలో గాఢతను మెదడుకు, ఒంటికి పట్టించుకోవడమే కష్టం. ఆ పని చాలా కష్టం. ఈయన వచనం బాగుంది. సామాన్యుడి కథ ఇది కూడా! గొర్రెల కాపాలదారుల కథ..మన జీవితం..మన జీవనం వీటిని తెలిపిన సీమ కథ..అన్ని కథల కన్నా భిన్నం. ఈ కథలో ఫ్యాక్షన్ ఉండదు.మెలో డ్రామా ఉండదు. ఓ స్వచ్ఛమయిన జీవితం మాత్రమే ఉంటుంది.