మా పోరు : రాముడేమన్నాడో!
సకల శుభాలు చేకూర్చే రాముడు తనకు కలలో కనిపించి పోటీ చేయవద్దని చెప్పాడని అంటున్నారు సీవీఎల్ నరసింహ రావు(సీనియర్ నటుడు). సభ్యుల సంక్షేమం కావాలా... అధ్యక్ష పదవి కావాలా అని తేల్చుకోమని అడిగితే, తాను సభ్యుల సంక్షేమం వైపే మొగ్గు చూపానని చెప్పారు. దీంతో తాను ఎన్నికల నుంచి వైదొలగానని తెలిపారు. వాస్తవానికి న్యాయవాద వృత్తి నేపథ్యం ఉన్న సీవీఎల్ నరసింహరావు గతంలో మా అసోసియేషన్ ను రెండుగా విడగొట్టాలని, ఆంధ్రా, తెలంగాణకు వేర్వేరు అసోసియేషన్లు నియమించాలని కోరారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తప్పుకుని సభ్యుల సంక్షేమానికి పాటుపడతానని చెప్పారు.
రెండు వర్గాలుగా ఉన్నాయా సినిమా వర్గాలు అంటే అది కూడా కాదు. ఇంకా ఎన్నో వర్గాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. వాటికి తార్కాణంగానే సీవీఎల్ లాంటి సీనియర్ యాక్టర్లు తెరపైకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి సీనియర్లు కూడా మీడియా ముం దుకు వచ్చి మాట మారుస్తుండడంతో, బరిలో విత్ డ్రా చేసుకున్నామని చెబుతూ అనవసరంగా తమ పరువు తామే పోగొట్టుకుం టున్నారు.
రోజుకో వివాదం..పూటకో విభేదం అన్న రీతిలో మా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు నటులు. నటుల జీవితంలో ఇన్ని న లుపు, తెలుపులు ఉన్నాయా అన్నంత సస్పెన్స్ ఉంది. అదేవిధంగా విష్ణు ప్యానెల్ సభ్యులూ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులూ ఇ ష్టారీతి న తిట్టుకుంటున్నారు. అదేవిధంగా పోటీలో ఉన్న సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ సమస్య తీవ్రతను పెంచు కుంటూ పోతున్నారు. ఇప్పుడిదే ఇండస్ట్రీకో సమస్యగా మారింది. ముఖ్యంగా మా అసోసియేషన్ కు భవనం విషయమై, పింఛన్లు విషయమై, అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ కు సంబంధించి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంలో జీవీఎల్ కూడా తన దైన పాత్ర పోషించడం విశేషం.