మా పోరు : జగన్ కు సంబంధం లేదట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకు, మా ఎన్నికల పై ప్రేమ ఉందని కొందరు, లేదని కొందరు అంటున్నారు. ఎవరు గెలిచినా తమ వాడే అన్న భావనను ఏపీ సీఎం భావిస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇంటి చుట్టం విష్ణు గెలుపే ధ్యేయం అని జగన్ పైకి అనరు..కానీ లోపల అభిప్రాయం వేరుగా ఉంటుంది. అయినప్పటికీ ఎవరు గెలిచినా జగన్ సర్కారు చేసే సాయం ఏంటన్నది తేలిపోనుం ది. పైకి జగన్ కు ఆసక్తి లేదని అన్నా, తమ ఇంటి చుట్టం గెలుపును నిర్దేశించే స్థాయిలో ఇవాళ ఏపీ సీఎం ఉన్నారన్నది వాస్తవం. కానీ అస్సలు ఇలాంటి వివాదాల్లో ఆయన పేరెందుకు తెస్తారని అంటున్నారు విష్ణు అభిమానులు.
ఇంకా చెప్పాలంటే.. :
ఏపీ సీఎం అభిప్రాయం ఎలా ఉన్నా, ఆయన ఆసక్తులు ఎలా ఉన్నా, మా ఎన్నికలకు సంబంధించి అనేక వాదోపవాదాలు నడుస్తు న్నాయి. విష్ణు కొన్ని మాటలు చెబుతుంటే., వాటికి ప్రకాశ్ రాజ్ కౌం టర్ ఇస్తున్నారు. పోటాపోటీగా మీడియా మీట్ లు నిర్వహి స్తూ, ఇంటర్వ్యూలకూ హాజరవుతూ హాయిగా ఎవరి పరువు వారే తీ సుకుంటున్నారు. విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న వారు కొన్ని మాటలు చెబుతుంటే, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన వారు మరి కొన్ని నిర్ణయాలు వెల్లడి చేస్తున్నారు. అసోసియేషన్ కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందు తమ పేరే, తమ ఇంటి పేరే వినిపిస్తుందని విష్ణు అంటున్నాడు. అదేవిధంగా మోహన్ బాబు కూడా తమకు బంధం ఉన్నా ఏపీ సీఎం దగ్గరకు పోయి మాట్లాడేందుకు తాను ఎన్నడూ చొరవ చూపడం లేదు అని స్పష్టం చేస్తున్నారు.
ఎందుకీ వేదాంతం? :
ఇవన్నీ ఎలా ఉన్నా చిరు సపోర్ట్ ప్రకాశ్ రాజ్ కు ఉంది. కనుక ఆయనే విన్నర్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. చిరు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ఒకప్పుడు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడు యాక్టివ్ అయితే., ఒకప్పుడు యాక్టివ్ గా ఉన్న నాగ బాబు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఏపీ సీఎంపై పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తమ మనిషే మా అధ్యక్షుడు కావాలని ఎందుకని సీఎం అనుకోరు..ఇది పూర్తి విరుద్ధం అని, పైకి అలా చెప్పి తప్పుకోవడం రాజకీయం అని జనసేన వ్యాఖ్యలు చేస్తోంది.
అదేవిధంగా ఏపీ సీఎం కూడా ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. కానీ పేర్ని నాని మాత్రం మా ఎన్నికలకూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చేస్తున్నారు. నిజంగానే ఈ ఎన్నికలను జగన్ పట్టించుకోవడం లేదా? ఎందుకని ? ఎందుకీ వేదాంతం?