ఫోకస్ పాయింట్ : వైఎస్ ఓటు కాంగ్రెస్ కే!
ఇదే సమయంలో ఆమెకు పోటీగా అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఆయన కూడా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్లోనే నడవనున్నారు. అయితే నేరుగా కాదు పార్లమెంట్ నియోజకవర్గాల వరకూ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ప్రశాంత్ కిశోర్ ను నమ్ముకోనున్నారు. షర్మిల మాత్రం అటు ఎమ్మెల్యే స్థానాలకూ ఇటు ఎంపీ స్థానాలకూ వ్యూహాలు సిద్ధం చేయాలని , ప్రత్యర్థి పార్టీలపై అభ్యర్థులను నిలిపి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణాన కాంగ్రెస్ కు షర్మిల రాక నష్టం కావొచ్చు
లేదా లాభం కావొచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలకూ రోల్ మోడల్ , ఐకన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డే కనుక!
ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హవాను ఎవ్వరూ కాదనలేరు. ఆ రోజు ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర కారణంగానే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి విజయ ఢంకా మోగించింది. తరువాత 2009 ఎన్నికల్లోనూ పీఆర్పీ హవాలోనూ కాంగ్రెస్ గెలిచి తన సత్తా చాటుకునేందుకు అవకాశం దక్కించుకుంది. తరువాత 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లోనూ తనదైన ఓటు బ్యాంకు పోగొట్టుకుంది. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పేరు లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో కొందరు టీఆర్ఎస్ గూటికి పోయారు. అధికార పార్టీకి అండగా ఉన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ఉండిపోయింది. ఇలాంటి సందర్భాలను అస్సలు కాంగ్రెస్ ఊహించలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ కూడా మంచి పేరు తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలనూ ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది అంటే అందుకు కారణం వైఎస్సారే ఫ్యాక్టరే! విభజిత ఆంధ్ర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ వైఎస్ ను స్మరించడం మానుకుంది. ఆయన పేరును పలికేందకు ఇష్టపడ లేదు. అంతా తామే అయి ఆ రోజు పార్టీని నడిపామని జగన్ కుటుంబం చెప్పినా వినిపించుకోలేదు. ఫలితం ఇప్పటికీ అనుభవిస్తోంది. ఈ తరుణాన రాజశేఖర్ రెడ్డి ఓటు బ్యాంకు ఎటువెళ్తుంది అన్న ప్రశ్న ఒకటి ఉదయించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే షర్మిల గెలుపునకు గ్యారంటీ అస్సలు లేదు కనుక కాంగ్రెస్ లో ఉన్న కొద్ది మంది రెడ్లకూ వైఎస్సార్ స్మరణే కీలకం కానుంది. ఆయన స్మరణతోనే ఓట్లు దండుకునేందుకు ఛాన్స్ ఉంది. షర్మిల పార్టీని ఇప్పటికిప్పుడు తెలంగాణలో నమ్మేందుకు వీల్లేదనే అంటున్నారు కొందరు ఓటర్లు. ఫక్తు తెలంగాణ వాదులు.....