హుజురాబాద్ ఎన్నిక : ఆ ఒక్క పథకం గెలిపిస్తుందా?

RATNA KISHORE
హుజురాబాద్ ఎన్నికలు అన్నవి తెలంగాణ రాతను మార్చవు. ఆ మాటకు వస్తే ఏ ఎన్నికలు కూడా పాలకుల రాతలు మార్చుతా యే కానీ పాలితుల రాతలు మార్చవు. మార్చవు కానీ మార్చేందుకు అవి ప్రయత్నిస్తున్న విధంగా పైకి కనిపిస్తాయి. ఆ విధంగా హుజురాబాద్ నిలవనుంది. కేసీఆర్ కన్న కలలు నెరవేర్పునకు సాయం అందించనుంది. ఏమో! తెలియదు కానీ అన్నీ కుదిరితే గెలుపు గెల్లుదే!


కౌశిక్ రెడ్డిని ఇటుగా తీసుకువచ్చి రెడ్డి ఓట్లను తనకు అనుకూలంగా మలుచుకున్నారన్న ధీమాలో కేసీఆర్ వర్గీయులు ఉన్నా రు. రెడ్డి ఓట్లన్నీ కౌశిక్ ను చూసే పడవు కదా! కనుక ఈ లాజిక్ వర్కౌట్ కాకపోవచ్చు. ఇక కౌశిక్ కు పదవీ యోగం కూడా దక్క లేదు కనుక ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తారా అన్నది మరో డౌట్. గవర్నర్  ఖాతాలో ఇది పెండింగ్ ఫైల్ కావడంతో ఎం ఎల్సీ యోగం లేకుండా పోయింది. ఇక మిగిలిన నేతలు మిగిలిన పార్టీలు ఎలా ఉన్నా ఇరు పార్టీల కొట్లాటలో దళితులే కీలకం అని తేలిపోయింది. వీరితో పాటు గొల్లలు, వీరితో పాటే ఇంకొన్ని సామాజిక వర్గాలు ఉన్నా సోయి కేసీఆర్ కు లేదు అని కూడా తేలిపోయింది. ఒక సామాజికవర్గానికి కోట్ల రూపాయలు నిధులు రాత్రికి రాత్రి విడుదల చేయడం అన్నది బాహాటంగానే ఓటు కొనుగోలే ! కానీ దీనిని సామాజిక న్యాయ సూత్రాలకు విస్తృతం చేసి కేసీఆర్ మాట్లాడడమే ఇక్కడ పెద్ద లాజిక్కు. ఈ లాజిక్క్ పనిచేస్తే వర్కౌట్ అయితే గెలుపు గులాబీ దండుదే! గెల్లు శ్రీనుదే! కావొచ్చు.


కేసీఆర్ ఆశలు కానీ హరీశ్ రావు ఆశలు కానీ దళిత బంధు పథకంపైనే ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎ స్ సర్కారు ఎనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మక పథకం ఇదే. గెలుపునకు సంబంధించి రెండు పార్టీలూ కొట్టుకుంటున్నాయి. చొక్కాలు చింపుకుంటున్నాయి. అయినా ఈ ఒక్క పథకమే రాజేందర్ ఓటమిని నిర్ణయించేలా ఉంది. కేసీఆర్ కూడా పథకం అమలుకు సంబంధించి ఎన్నో ఆంక్షలు విధించి మరీ! లబ్ధిదారులకు ముందుగా నిర్ణయించిన పది లక్షల రూపాయలు అందించారు. ఇందులో కొంత మొత్తాన్ని మినహాయించి భరోసా నిధి పేరిట ఉంచారు. అదేవిధంగా యూనిట్ల కొనుగోలుపై కూడా పూర్తి ఆంక్షలు ఉన్నాయి.


ఉపాధి పొందేందుకే కానీ విలాసాలకు కాదని కేసీఆర్ మరో మారు స్పష్టం చేశారు కూడా! ఇవన్నీ ఓ విధంగా ఉంటే దళిత బంధు పథకం మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేయాలన్న ప్రతిపాదలనూ తోసి పుచ్చలేదు కేసీఆర్. అయితే ఈ పథకం అమలు ఆకాంక్ష అన్నవి విజయవంతం అయితేనే మిగతా జిల్లాలకు విస్తృతం చేయాలన్నది పాలకపక్షం ఆలోచన. ఇక హుజురాబాద్ లో ఈ పథకం ఒక్కటే కేసీఆర్ ఆశలు నెరవేర్చేలా ఉందా లేదా ఇంకేమయినా మంచి పనులు కూడా కేసీఆర్ కు పేరు తెస్తాయా?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: