పవన్ యుద్ధం ఆగేనా?
రాజకీయాల్లో గులాబ్ తుఫాను మాదిరి తీవ్ర తుఫానులేవో రేగుతున్నాయి. పాత కోపాలు వాటి తాపాలూ ఒక్కసారిగా వెల్లడి అవుతున్నాయి. దీంతో క్యాస్ట్ కార్డ్ పాలిటిక్స్ అన్నవి ప్రధానంగా అంతఃకలహాలకు కారణం అవుతున్నాయి. ఇదే సందర్భంలో పవన్ పై యుద్ధానికి సై అంటున్నాయి కొన్ని వర్గాలు. వీటి కారణంగా పవన్ నాయుడు, జగన్ రెడ్డి అన్న పదాలు ఎక్కువగా వినిపించడం విచారకరం.
కాపు యుద్ధం మొదలైందా? అన్న విధంగా ఒకే సామాజిక వర్గ నేతలు కొట్టుకుంటున్నారు. పవన్ మాటలపై రాజకీయ యుద్ధ భేరీ మోగించిన మంత్రులు ఇకపై అదే పంథాను కొనసాగించాలని తహతహలాడుతున్నా రు.తాపత్రయపడుతున్నారు. ఈ క్రమం లో తమ రాజకీయ లబ్ధి ని కూడా చూసుకుంటున్నారు. పవన్ ఇచ్చిన రిప్లైలకు, కౌంటర్లకు తామూ బదులివ్వాలని మంత్రులు మరింత వ్యూహంతో ముందుకుపోతున్నారు. టీడీపీ,జనసేన పొత్తు ఫిక్స్ అయితే మంత్రుల దాడి మరింత పెరిగిపోవడం ఖాయం.
తాను కూడా కాపు సామాజికవర్గంకు చెందినవాడినే అని పేర్నినాని పవన్ కు బదులివ్వడంతో ఒక్కసారిగా కాపు సామాజికవర్గం కేంద్రంగా రాజకీయాలు మరింత ఆసక్తిగా మారిపోయాయి. తాను చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తానని, తనకు సురేఖ వదిన మ్మ అని చెప్పి, పవన్ ను మరింతగా టార్గెట్ చేయడంతో పాటు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వివాదాలు రేగుతున్నాయి. దీంతో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. పవన్ ను తిడితే క్రేజ్ వస్తుందనుకుంటున్న మంత్రులు తద్వారా తామెంత నష్టపోతు న్నామన్నది గ్రహించలేకపోతున్నారు.
ఇంకా చెప్పాలంటే.............
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. దీంతో అటు వైసీపీ వర్గాలు, ఇటు సినిమా వర్గాలు సందిగ్ధంలో పడ్డాయి. నలుగురు మంత్రులు పవన్ వ్యాఖ్యలపై కౌంటర్లు పాస్ చేశారు. ముఖ్యంగా అవంతి శ్రీను, బొత్స తో సహా పేర్నినాని స్పందించి, తామేం చెప్పాలనుకున్నామో కాస్త ఘాటుగానే స్పందించారు. ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసేలానే ఉన్నాయి. రానున్న ఎన్నికలు ముందస్తూ వ్యూహం అన్నవిధంగా ఇరు వర్గాలూ కొట్టుకుంటున్నాయి. మాటల తూటాలు పేలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సన్నాహమా అన్న విధంగా పేర్ని నాని, పవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. క్యాస్ట్ కార్డ్ పాలిటిక్స్ కూడా వెలుగులోకి వచ్చాయి.