జనాభా ఎక్కువ ఉంటె.. అభివృద్ధి ఇంతేనా.. !

Chandrasekhar Reddy
అభివృద్ధికి జనాభా కు ముడిపెట్టడం సమంజసమేనా..! ఒక దేశ జనాభా ఎక్కువగా ఉంటె అభివృద్ధి అందని ద్రాక్ష అయిపోతుందా..! ఇది నిజామా, అలా చూపిస్తున్నారా..! భారతదేశం అతి త్వరలో అత్యధిక జనాభా గల దేశంగా ప్రపంచం ముందు నిలబడనుండి. అయితే స్వాతంత్రమ్ వచ్చి 75 వసంతాలు పూర్తి అయినప్పటికీ ఇంకా అబివృద్ది చెందుతూనే  ఉంది. దానికి ప్రధాన కారణంగా అధిక జనాభా అంటూ సాకులు చెప్తూ ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. సాధారణంగా ఒక కుటుంబంలో అందరు సంపాదించడం వలన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ దిగజారిపోదు కదా. అయితే వాళ్లంతా ఐక్యతతో ఉండాలి, కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలలో ఓపికగా ఆలోచించి తీసుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది.
దేశం కూడా అతిపెద్ద ఉమ్మడి కుటుంబమే కదా. మరి దేశంలో జనాభా ఎక్కువగా ఉంటె వారందరూ తమతమ పనులను చేస్తూ పోతుంటే అభివృద్ధి కూడా సాధించవచ్చు కదా. అయితే ఒక్కో దేశం పరిస్థితులు, వనరులు తదితర విషయాలను బట్టి ఆ దేశ అబివృద్ది ఎలా ఉండాలో నిర్ణయించబడుతుంది. భారతదేశం అన్ని వనరులు ఉన్న దేశం. అవి సరిగ్గా వినియోగించుకుంటూ(మానవ వనరులు కూడా కలిపే) పోతే అభివృద్ధి చెందటం పెద్ద విషయం ఏమీ కాదు. అందరికి పని అంటే ఉద్యోగాలు కావాలి, అవి ఎక్కడ నుండి తేవాలి..! ఆలోచన చేస్తే దానికి పరిష్కారం తెలుస్తుంది. ఉదాహరణకు ప్రతి కుటుంబంలో పని చేయగలిగిన వారు, చేయలేని వారు ఉంటారు. చేసే వారి విషయానికి వస్తే, వాళ్ళ కు ఏదైనా కుల వృత్తి ఉంటె దానిని చేసుకునే సౌలభ్యం కలిపిస్తే సరిపోతుంది లేదా అటువంటిది లేని వారికి(దేశంలో 134కోట్ల జనాభా ఉంది, వీరికి కావాల్సిన కనీస అవసరాలు అయిన ఆహారం, ఇళ్లు, వస్త్రాలు, వైద్యం, విద్య, ఉద్యోగం లాంటివి అందించడానికి అందరూ వీటి ఉత్పత్తి, అమ్మకం లాంటివి చేస్తూ పని కల్పించుకోవచ్చు) ఏదైనా పనిలో శిక్షణ ఇచ్చి ఆయా పనులు చేపించుకోవడం ద్వారా ఉపాధి కల్పన చేయవచ్చు.
పైన చెప్పిన అన్ని ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే అనేక సంస్థలు వెలిశాయి. వాటికి విద్యుత్, ఇతర ఎన్నో వనరులు అవసరం అవుతున్నాయి. అదే ఇవన్నీ మానవ వనరులు చేస్తే విద్యుత్ అనవసరపు వినియోగం తగ్గి, కావాల్సిన అందరికి అది అందించవచ్చు. ఉదాహరణకు వస్త్ర ఉత్పత్తి తీసుకుందాం. దానికి ముడి సరుకు పండించడం రైతు అనే మానవ వనరు పని, దానిని దారంగా చేసే మరో నైపుణ్యం కలిగిన మానవ వనరు కావాలి; దానిని బట్టగా తయారు చేయడానికి మగ్గం నేతలు ఎలాగూ మానవ వనరుగా ఉన్నారు, చివరికి తయారైన వస్త్రం (అది ఒట్టి వస్త్రం అయినా లేదా రెడీమేడ్ లాంటివి అయినా(నేతన్న నైపుణ్యం)) వినియోగదారులకు చేర్చడం. ఇక్కడ ఎక్కడా మానవ వనరులు కాకుండా మరొకటి అవసరం కనిపించలేదే, అంటే అనవసరపు విద్యుత్ వినియోగం లేదు. దీనికి పరిశ్రమ అవసరం లేదు, నేతన్నలు సరిపోతారు, ఒకవేళ జనాభా అవసరాల మేరకు వీళ్లు అందించలేరు అనేది వాదన అయితే వీళ్ళ దగ్గర ఇలాంటివి చేయడానికి ఆసక్తి చూపే యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచుకోవచ్చు. మిగిలినవి అన్ని అవసరాలు కూడా ఇలాగె మానవ వనరుతో చేసుకుంటే ఇతర అనవసర వనరులు ఖర్చు ఉండదు. ఈ విధానం వలన అందరికి ఉపాధి లభిస్తుంది. అంటే అభివృద్ధికి మొదటి పెద్ద అడుగు పడ్డట్టే. ఇలా కనీసం ఐదేళ్లు కస్టపడి చూద్దాం, దేశం ఎందుకు అభివృద్ధి చెందడో అదీ అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: