ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. ఏం జరగబోతోంది..?

frame ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. ఏం జరగబోతోంది..?

MOHAN BABU
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యల పై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో సాయంత్రం గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశాన్ని సీరియస్ గా చర్చించాలని మాణిక్యం టాగూర్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. సాయంత్రం జరిగే పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో ఏం జరగబోతుందని ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. సంగారెడ్డి జిల్లా లో జరిగే కార్యక్రమానికి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి కి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్ రేవంత్ దే అంటున్నారు సీనియర్ నాయకులు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం అనేది సీరియస్ గా పరిగణించడం జరిగింది.

 తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పై అధిష్టానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవి చేపట్టినప్పటి నుండి తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఇవాళ మొదటగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీయనున్నారు. ఈ భేటీలో కొత్తగా పార్టీలో చేరిన సీనియర్ నాయకులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు మాణిక్యం ఠాగూర్ కూడా సమావేశం కానున్నారు. ఈ కమిటీలో జగ్గారెడ్డి తీరుపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ నాయకులు చెప్తున్నారు.

జహీరాబాద్ సమావేశానికి వెళ్ళినప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కి సమాచారం ఇవ్వలేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా సీనియర్లు తప్పు పడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం,  సొంత జిల్లాలో పర్యటిస్తూ పిసిసి ప్రెసిడెంట్ గా ఆయనకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి పై ఉంటుందని, ఇది ఆయన తప్పిదం కూడా అని పార్టీలోని కొంతమంది నాయకులు తప్పుపడుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: