మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా నటించిన ఐదు మూవీ లకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
రామ్ చరణ్ ఆఖరుగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 29.50 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. రామ్ చరణ్ కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు 74.11 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. రామ్ చరణ్ ఆఖరుగా సోలో హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. ఇకపోతే వినయ్ విధేయ రామ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.99 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.
రామ్ చరణ్ కొంత కాలం క్రితం రంగస్థలం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.5 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా రూపొందిన ధ్రువ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.40 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా జనవరి 10 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏ రేంజ్ షేర్ కలక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.