రాజశేఖర్ రెడ్డి హయాంలో కొందరు నేతలు ఎదిగారు. ఆయన కూడా ఎదగనిచ్చాడు. జగన్ మాత్రం నాన్నకు పూర్తి భిన్నం. ఉత్తరాంధ్ర లీడర్ల ఎదుగుదలకు ఆయన సహకరించరు. ఆ మాటకు వస్తే సీనియర్లంటే ఆమడ దూరంలో ఉండి మాట్లాడే నైజంలో ఆయన ఉంటున్నారని ఓ విమర్శ ఉంది. వైఎస్ కు ధర్మాన, బొత్స, ఈ ఇద్దరూ కూడా బాగా ఇష్టమయిన నేతలు. వారిని ఆయన ప్రోత్సహించారు. పదవులు ఇచ్చి, తన ఇలాకాలో తిరుగులేని విధంగా చూసుకున్నారు. జగన్ లా పదువులు ఇచ్చి ఊరుకోలేదు వారికి అధికారం ఇచ్చారు. కానీ జగన్ జీఎస్టీ టైపు.. పన్నుల వసూలు రాష్ట్రాలది పెత్తనం కేంద్రానిది అన్న విధంగా మంత్రుల అధికారం అంతా తనది కేవలం ఆడే బొమ్మలే వాళ్లు. ఈ బొమ్మలాటలో బొత్స ఇరుక్కుపోయారు.
దీంతో ఆయన అటు పార్టీని వీడనూ లేక, సొంత పార్టీ పెట్టే తోవ లేక మధ్యలో ఉండిపోయారు. సొంత మనుషులుగా వారిని పైకి చూసినా, అన్నా అంటూ సంబోధించి మాట్లాడినా అవన్నీ పైపై మెరుగులే.. మెరుగులు కన్నా మరకలే ఎక్కువ అని తమని ఆయన గుర్తించరని చాలా సార్లు మంత్రులు ప్రయివేటు సంభాషణల్లో సైతం వాపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి మీడియా లీకులంటే పరమ చిరాకు.అందుకు కారణం అయిన వారిని ఆయన వదలడు. ఈ కోవలోనే మంత్రులెవ్వరూ మీడియాతో పెద్దగా మాట్లాడరు. జగన్ ఆదేశం ఉంటేనే మాట పైకి వెల్లడికి నోచుకుంటుంది. అదీ జగన్. అందుకే కోట్ల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాలిటిక్స్ కు ఆయన ప్రోత్సాహం అందిస్తారు. పైకి కార్యకర్తలే దేవుడు లోపల కార్పొరేట్ కంపెనీలే దేవుళ్లు. దేవుడికి, దేవుళ్లకీ ఎంత తేడానో!
రెండు పార్టీలకు ఒకే వ్యూహకర్త కావడం రాజకీయ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం యాదృశ్చికం. కారణాలు ఏమయినా వైసీపీ కి ప్రశాంత్ కిశోర్ అవసరం ఏముందని అంతా అంటున్నారు. సోషల్ మీడియాలో కార్యకర్తలు వైసీపీ అధిష్టానంపై ఫైర్ అవుతున్నా రు. జగన్ కు స్థానిక నాయకుల మద్దతు ఉందని, వారిని వాడుకోకుండా ఉత్తరాది మనుషుల అవసరం ఏముందని... ఏమోచ్చిం దని మండిపడుతున్నారు. కొందరు బాహాటంగానే పార్టీ కోసం కృషి చేసిన వారంతా విమర్శలు చేస్తున్నారు. అయినా జగన్ సీనియ ర్లను నమ్మడు. నమ్ముకోడు అని కూడా ఓ టాక్ నడుస్తోంది పార్టీలో! బొత్సకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడు అని కూడా గతం లో తేలిపోయింది. అందుకే ఓ సందర్భంలో బొత్స ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఉంచుకున్నారని అయినా కూడా సీఎం నుంచి స్పంద న లేనే లేదని కొందరు చెబుతారు. బొత్స లాంటి పవర్ ఫుల్ లీడర్లను ఇంకాస్త ప్రోత్సహిస్తే సీఎం కుర్చీకి ఎక్కడ ఎసరు పెడతారోన న్న భయం జగన్ ను వెన్నాడుతోందా?