డ్రగ్ వివాదంలో బండి సంజయ్ పేరెందుకు ?
టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్ రాకెట్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ ప్రవేశించింది. నిందితులను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేస్తుంటే కేటీఆర్ వారినెందుకు వెనకేసుకుని వస్తున్నారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్. ఇదే సందర్భంలో కేటీఆర్ కూడా తీ వ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను వేరు తన స్థాయి వేరు అని చెబుతూ, వివాదాలకు తెర లేపుతున్నారు. ఇవే ఇప్పు డు తెలంగాణలో చర్చనీయాంశం అయ్యాయి. ఇంతవరకూ వైట్ ఛాలెంజ్ పేరిట రేవంత్ చేసిన రాజకీయం కారణంగా కాంగ్రెస్ పొందిన మైలేజ్ ఎలా ఉన్నా కేటీఆర్ మాత్రం వివాదాల్లో ఇరుక్కుపోయారు. కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేటి కాలనీలోనే ముక్కుపచ్చ లారని చిన్నారి చైత్ర హత్యకు గురైందని, ఇందుకు కారణం కూడా డ్రగ్ వినియోగమేనని ఆరోపిస్తూ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా పరిగణించదగ్గవే!
ఎందుకంటే ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున ఎప్పటి నుంచో ఉన్న గంజాయి మూకలపై, అదే వి ధంగా డ్రగ్ ఏజెంట్లపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సికింద్రాబాద్ గన్ పార్క్ వద్ద తీ వ్ర ఆందోళనలు నెలకొన్నాయి. టీపీసీసీ లీడర్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు అధికార పార్టీ టీఆర్ఎస్ నే కాదు బీజే పీనీ టార్గెట్ చేశాయి. దీంతో రేవంత్ రెడ్డి పలు సవాళ్లు విసిరా రు. తాను విసిరిన వైట్ ఛాలెంజ్ కు మంత్రి కేటీఆర్ రాలేదని, తాను ఎటువంటి పరీక్షలకు అయినా సిద్ధమేనని అన్నారు. ఇదే సమయంలో కొండా విశ్వేశ్వర రెడ్డి అక్కడికి చేరుకుని మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కు, ఆర్ ఎస్ ప్రవీణ్ కు వైట్ చాలెంజ్ విసు రుతున్నానని అన్నారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారి గా వేడెక్కింది. వాస్తవానికి ఈ వివాదం కాంగ్రెస్, కేటీఆర్ మధ్య జరుగుతున్నా మాజీ ఎంపీ వ్యాఖ్యలతో బండి సంజయ్ ను కూడా ఇందులో ఇరికించారు. ఇక బండి సంజయ్ ఏ విధంగా స్పంది స్తారో అన్నది చూడాలిక.