నిధులు - విధులు : జగన్ కు కేంద్రం మరో ఝలక్ ?
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే పనులకు సంబంధించి ఏపీ సర్కారు అనుసరిస్తున్న వ్యూహం వివిధ వివాదాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. నిధుల పక్కదోవకు కారణాలు ఏవయినా వీటి లెక్కలపైనే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య కొత్త వాగ్యుద్ధం నెలకొంది. తాము ఇచ్చిన నిధులు సకాలంలో సజావుగా ఖర్చు చేయడం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ గుర్తించి కేంద్ర ఆర్థిక శాఖను అప్రమత్తం చేసింది. దాదాపు వెయ్యి కోట్లకు సంబంధించి లెక్కలను అప్పగించనిదే ఇకపై నిధులు విడుదల ఉండదని కూడా కేంద్ర ఆర్థిక శాఖ తేల్చింది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో మంచి ఉత్సాహంతో ఉన్న జగన్ వర్గానికి ఇప్పుడొక ఊహించని షాక్ తగిలింది. ఇబ్బడిము బ్బ డిగా సంక్షేమానికి నిధులు వెచ్చించి, ఖర్చులు లెక్కలు చూపకుండా కేంద్రానికి చుక్కలు చూపిస్తున్న జగన్ కు ఇప్పుడో పె ద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటిదాకా ఖర్చుకు, తెస్తున్న అప్పులకూ ఎటువంటి పొంతనా లేదని కాగ్ కూడా చెప్పేసింది. అదేవిధం గా కాగితాల్లో చూపని లెక్కలు, ఖర్చుచేసిన రూపాయలూ ఉన్నాయని నెత్తీ నోరూ బాదుకుంటోంది. అయినా జగన్ కొత్త అప్పుల అన్వేషణ ఉండగా కేంద్రం మాత్రం ఆయన స్పీడుకు బ్రేకులు వేసే చర్యలకు ఉపక్రమించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ రాష్ట్రంకు సంబంధించి ఓ కీలక నిర్ణయం వెలువరించింది.