జగన్ కి తన మీద నమ్మకం కంటే... ?

Satya
జగన్ అంటే దూకుడుకు మారు పేరు అని చెబుతారు. ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకున్నా కూడా ముందుకే తప్ప వెనక్కి వెళ్ళరు అని అంతా అంటారు. అది నిజమే కూడా. అయితే జగన్ సీఎం అయ్యారు. తన కలలను నెరవేర్చుకున్నారు. అంతే కాదు మళ్లీ మళ్లీ సీఎం కావాలని కూడా ఆశపడుతున్నారు.
ఏపీలో ప్రతిపక్షం అన్నది లేకుండా చూడాలని కూడా భావిస్తున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం సంక్షేమ పధకాల మీదనే ఆధారపడి ముందుకు సాగుతున్నారు. ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తున్నారు. ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. కానీ ఈ  సంక్షేమ పధకాలు పంచుడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున  ఓట్లు రాలుస్తాయా అన్న చర్చ అయితే ఉంది. ఇది వైసీపీలోనే హాట్ హాట్ గానే సాగుతోంది.
అయితే ఇపుడు ఆ డౌట్ ఏదో జగన్ కి కూడా వచ్చిందా అన్నదే అందరి మాటగా ఉంది. జగన్ 2019 ఎన్నికల వేళ కేవలం వైసీపీ అధినేత మాత్రమే. ఆయన అపుడు హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో నెగ్గారు. ఇపుడు అంటే 2024 ఎన్నికల వేళకు జగన్ తన పాలనను చూపించి మాత్రమే జనాల మద్దతు కోరాలి. కానీ జగన్ తన పాలనలో సంక్షేమం తప్ప చెప్పుకునేందుకు ఏమీ లేకుండా చేసుకున్నారు అంటున్నారు.
అంతే కాదు అభివృద్ధి అన్నది మచ్చుకైనా కనిపించడంలేదు. మరి కేవలం దీని మీదనే ఎన్నికలకు వెళ్తే రిజల్ట్  తేడా కొడుతుంది అన్న సందేహాలు ఉండబట్టే జగన్ మళ్ళీ పీకే మద్దతు కోరుతున్నారా అన్న మాట కూడా వినిపిస్తూంది. ప్రశాంత్ కిషోర్ సేవలను జగన్ మళ్ళీ కోరుకుంటున్నారు అంటే భారమంతా ఆయన వ్యూహాల మీదనే వేశారన్న మాట. మరి జగన్ కి ఈసారి పీకే వ్యూహాలు ఎలా సరిపోతాయో. జనాల మద్దతు ఆయన ఎలా సాధించగలరో చూడాలి. ఏది ఏమైనా ఒకసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా కూడా ప్రజలు వాటి కంటే కూడా పాలనను చూసి మాత్రమే ఓటేస్తారు అన్నది నిజం. ఆ విషయంలో జగన్ జనాలను  ఫేస్ చేయాల్సిందే అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: