జగన్ కేసు: ఇద్దరు ఐఏఎస్ లు అరెస్ట్

Sahithya
సిబిఐ
, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరగగా ఇద్దరు ఐఏఎస్ అధికారులకు షాక్ తగిలింది. కోర్ట్ మాట లెక్క చేయని అధికారులపై కోర్ట్ సీరియస్ అయింది. విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది సిబిఐ కోర్ట్. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డిపై ఎన్ బీడబ్ల్యూ జారీ చేసింది. అలాగే గనుల శాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్ పై ఎన్ బీడబ్ల్యూ జారీ చేయడం సంచలనం అయింది. ఓఎంసీ కేసులో విచారణకు హాజరు కానందున రాజగోపాల్ పై ఎన్ బీడబ్ల్యూ జారీ చేసినట్టు తెలిపింది.
వాన్ పిక్, దాల్మియా, జగతి పబ్లికేషన్స్, రాంకీ కేసుల విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది సిబిఐ కోర్ట్. అది అలా ఉంచితే రాంకీ ఈడీ కేసులో జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసారు. రాంకీ ఈడీ కేసు నుంచి తొలగించాలని  జగన్, విజయసాయిరెడ్డి కోర్ట్ ని కోరారు. రాంకీ ఈడీ కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ జరిగింది. ఈడీ కేసులు ముందుగా చేపట్టాలన్న తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మరోసారి విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు.
విజయసాయిరెడ్డి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం చేసింది కోర్ట్. స్టే లేనందున విచారణకు షెడ్యూలు ఖరారు చేయాలని ఈడీ అధికారులు కోరారు. జగతి పబ్లికేషన్స్ పై ఈడీ కేసు విచారణ ఈనెల 28కి వాయిదా వేసారు. ఓఎంపీ కేసులో లిఖితపూర్వక వాదనల కోసం సమయం కోరింది సిబిఐ. ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదావేసారు. కాగా రెండు రోజుల క్రితం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేయగా ఆయన పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: