మహిళను హోం మంత్రిగా నియమించారు జగన్. అదేవిధంగా మహిళా రక్షణకు దిశ పోలీసు స్టేషన్లను తీసుకువచ్చారు. వీటితో పాటు సచివాలయాల్లో మహిళల రక్షణ కు సంబంధించే ఓ ఉద్యోగిని నియమించారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి పేరిట ఆమె పనిచేస్తున్నారు. ఇవి ఉన్నా వీటితో పాటు వంద నంబర్ పనిచేస్తున్నా ఫలితం మాత్రం ఆశించిన విధంగా రావడం లేదు. ముఖ్యంగా స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకునేందుకు కూడా పోలీసులు జంకుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేధింపుల కేసులు నిలబడడం లేదు.
ఏపీ పోలీసు చెబుతున్న మాటలకూ, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలకూ అస్సలు సంబంధమే లేదు. కేసుల ని యంత్రణలో వీరి జాగ్రత్తలు ఏవీ ఫలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా సైబర్ క్రైం పెరిగిపో తోంది. కేసులలో ఫస్టు భద్రతలో లాస్టు అ న్న విధంగా ఏపీ ఉంది. అయినప్పటికీ తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, అదేవిధంగా మహిళలకు ఏ చిన్న సమ స్య వచ్చిన వర్క్ స్టేషన్లకు సంబంధించి తమకు ఫిర్యాదు ఇవ్వవచ్చని పోలీసులు చెబుతున్నా అవేవీ ఫలితం ఇవ్వడం లేదు.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో ఆంధ్రావని ఆందోళనకర స్థితిలో ఉంది. ఎన్నడూ లేని విధంగా గడిచిన రెండేళ్ల ను ప్రామాణికంగా తీసుకుంటే వేధింపులు రెట్టించాయి. అదేవిధంగా భద్రత లోపించింది. ముఖ్యంగా రక్షణ సంబంధ చర్యలు లేనేలేవు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న దిశ యాప్ ద్వారా పొందుతున్న రక్షణ అ న్నది అంతంత మాత్రమే అని తేలిపోయింది. ఈ దశలో వేధింపుల విభాగంలో నమోదయ్యే కేసులు నియంత్రణలో లేవు. భద్రతకు ప్రాధాన్యం అస్సలు లేదు. ఆపద కాలంలో తాము రక్షణ ఇచ్చే విధంగా పోలీసు తయారు చేసి యాప్ ద్వారా ఇప్పటిదాకా ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయని తేలింది. డౌన్లోడ్స్ మాత్రం యాభై లక్షలకు పైగానే ఉన్నాయని ఏపీ పోలీసు చెబుతున్నా రు.