ఎదురు దెబ్బ ?

ఎదురు దెబ్బ ?
వరుస విజయాలతో ముందుకు సాగాతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందా ? తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టి.ఎం.సి)రాజ్యసభ సభ్యురాలు అర్పితా ఘోస్ తన పదవికి రాజీనామా చేశారు. మమతాా బనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికల బరిలో నిలచి ఉన్నసంగతి అందరికీ తెలిసిన విషయమే. తమ పార్టీ ఎం.పి రాజీనామా సమర్పించే సమయానికి తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి ఎ ఎన్నికల ప్రచార సభలో భారతీయ జనతా పార్టీ పై నిప్పులు చెరుగుతూ, విమర్శలు చేస్తున్నారు.
అర్పితా ఘోస్ 2019 ఎన్నికల్లో  దక్షిణ దినజాపూర్ జిల్లా లోని బాలూర్ ఘాట్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.  భారతీయ జనతా  పార్టీ అభ్యరి్థ  సుఖంత్ మజుందార్ చేసిలో పరాజయం పాలయ్యారు అయి
తే 2020లో రాజ్యసభ స్థానం ఖాళీ అవడంతో తృణముల్ కాంగ్రస్ అధినేత్రి  ఈమేను రాజ్యసభకు పంపారు. నాటి నుంచి అర్పితా ఘోష్ ఎగువ సభలో తన వాణిని వినిస్తున్నారు.
 రాజసభ నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ఆరుగురు తృణముల్ కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించారు. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డు తగులుతుండడంతో పలుమార్లు రాజ్యసభాధ్యక్షుడయిన వెంకయ్య నాయుడు పలుమార్లు హెచ్చరించారు.  సభు సజావుగా నిర్వహించేదుకు ఆయన ఆరుగురు తృణముల్ కాంగ్రెస్ ఎం.పిలను సభ నుంచి బహిష్కరించారు. ఈ విషయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి బహిష్కరణకు గురైన అర్పిత ను తృణముల్ శ్రేణులు ఒక వీరోచిత మహిళగా కీర్తించారు.
 అర్పిత ఘోష్ హఠాత్తుగా తన రాజ్యసభ సభ్యత్వా నికి రాజీనామా చేశారు. దీనిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమోదించడం వెంట వెంటనే జరిగి పోయాయి. ఆమె పార్టీ మారుతార ? టి.ఎం.సి లోనే కొనసాగుతారా ? అన్న విషయం ప్రస్తుతం  పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: