సాయి ధరమ్ తేజ్ : సీన్లోకి జీహెచ్ఎంసీ ?
అధ్వానంగా ఉన్న రోడ్లకు కారణం కొన్ని కంపెనీల భారీ వాహనాలే అని తేలింది. అందుకే సమస్యపై దృష్టిసారించి, సంబంధించిన వివరాలు సేకరించి, అపరాధ రుసుము వసూలు చేసింది.. హైద్రాబాద్ నగర పాలక సంస్థ. ప్రమాదాలు జరిగినప్పుడే మీరు మే ల్కొంటారు అని కొందరు అడిగిన విధానం కాస్తయినా చలనం తీసుకువచ్చిందని భావిస్తే అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలు మరికొన్ని సంస్థలకు కనువిప్పు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళ రాకపోకలు సాగించే భారీ వాహనాల కారణంగానే తరుచూ కొన్ని రోడ్లు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని జీహెచ్ఎంసీ దృష్టికి నెటిజన్లు తీసుకురావడంతో వాటిపై కూడా ఫోకస్ చేసి, కొ న్ని కంపెనీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా రహదారి భద్రతపై, రోడ్డు శుభ్రత, నిర్వహణపై ని ర్మాణ కంపెనీలు పట్టించుకోవడం లేదు అన్నది ఓ వాస్తవం.
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సోషల్ మీడియాలో జీహెచ్ఎంసీ పై విపరీతం అయిన విమర్శలు వస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలపై కూడా కాస్త దృష్టి సారిస్తే, రోడ్లు ఏ విధంగా పనికి రాకుండా పోతున్నాయో అన్నది అర్థం అ వుతుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు. ముఖ్యంగా నగరంలో నిర్మాణ సంస్థల కార్యకలాపాల కారణంగా, బ హుళ అంతస్తుల పనుల్లో భాగంగా ఇసుక, మట్టి లారీలా ద్వారా రవాణా అవుతున్నాయి. వీటి కారణంగానే కొన్ని చోట్ల మట్టి మేట లు కానీ ఇసుక కుప్పలు కానీ తయారవుతున్నాయి. వీటిని పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించినా, హెవీ లోడ్ వె హికల్స్ రాకపోకల కారణంగా మళ్లీ అవి వస్తున్నాయి. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ పడిపో యిన చోటు సమీపానే ఓ నిర్మాణ కంపెనీ తన పనులు చేయిస్తుంది. కానీ రోడ్డు శుభ్రంపై అస్సలు ధ్యాసలేకుండా పనులు చేయి స్తుంది. అక్కడ జరిగే నిర్మాణాలకు ఇసుక, మట్టి తీసుకువచ్చే లారీల కారణంగానే అక్కడక్కడ అదే దారిలో చిన్న చిన్న మేటలు ఉన్నాయి. వీటిని తొలగించడంలో సంబంధిత సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. ఆ రోజు కూడా సాయి ధరమ్ ఈ మేటలను త ప్పించే క్ర మంలోనే కింద పడిపోయాడు. ఇదే విధంగా నగరంలో పలు చోట్ల ఇసుక, మట్టి మేటలు చిన్న చిన్నవి ఉన్నాయి. అదేవిధంగా కొ న్ని చోట్ల హెవీ వెహికల్స్ కారణంగా రోడ్లు పూర్తిగా పాడయిపోతున్నాయి. అదేవిధంగా రెడీ మిక్స్ వాహనాల వల్ల కూడా రోడ్లు అ ధ్వానంగా తయారవుతున్నాయి. వీటన్నింటినీ గుర్తించి సంబంధిత సంస్థకు నోటీసులు ఇచ్చారు జీహెచ్ ఎంసీ అధికారులు. అదే విధంగా ఖానా మెట్ వద్ద రోడ్డు గుంతలుగా మారడానికి కారణం అయిన అరబిందో సంస్థకు లక్ష రూపాయలు ఫైన్ వేశారు.