జగన్ బాటలో కేసీఆర్ ?
భూముల అమ్మకంతో ఆదాయాలు సమకూర్చుకోవాలన్న ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. ముఖ్యం గా మద్యం ఆదాయం గణనీయంగా పడిపోవడంతో, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆదాయం సేకరణకు మార్గాలు వెతుకుతున్నాయి. ఏపీకి సంబంధించి రాజధాని భూములపై ఇప్పటికీ ఓ స్పష్టత లేకపోయినప్ప టికీ కొన్ని చోట్ల మాత్రం భూముల అమ్మకంపై దృష్టి సారించింది అనే వార్తలు వచ్చాయి. విమర్శలు రేగడంలో ఏపీ సర్కారు వెనకడుగు వేసినప్పటికీ మున్ముందు ఆదాయం కావా లంటే భూముల వేలం తప్పదు. ఇదే విధంగా కేసీఆర్ కూడా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కోకాపేట తదితర ప్రాంతాలలో భూముల వేలం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు ఆర్జించిన టీ సర్కార్ ఇకపై మరిన్ని భూములను అమ్మకానికి గుర్తించాలని అధికారులను ఆదేశించిందని సమాచారం. కోకాపేట, ఖానామెట్ భూముల అమ్మకంపైనే కాంగ్రెస్ కూడా అభ్యంతరం చెప్పింది. విషయాన్ని సీబీఐ దృష్టికి సైతం తీసుకువెళ్లింది. ఈ ఘటనలో భాగం పంచుకున్న సీఎస్ తో సహా ఇతర ఐఏఎస్ లనూ విచారించి, అసలు నిజాలు వెల్లడించాలని కోరింది. ఇప్పటికిప్పుడు ఈ వివాదం తేలకపోయినా మరికొన్ని భూముల వేలం తప్పేలా లేదు.