గుడ్ న్యూస్ : నేటి నుంచి తెలంగాణలో డ్రోన్లు?

praveen
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే.  అయితే మొన్నటి వరకు రెండవ దశ కరోనా వైరస్ తో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కరోనా వైరస్ బారి నుంచి బయటపడింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతు ఉండడంతో ఆటో పాఠశాలలను కూడా ప్రారంభిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కరోనా వైరస్ మందులు పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

 ఉచితంగానే కరోనా వైరస్ కిట్ పేరుతో మందులను పంపిణీ చేస్తూ ఇక పేద ప్రజలందరికీ కరోనా సమయంలో మేమున్నాము అని భరోసా ఇస్తుంది.  అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో మనిషికి మనిషికి కాంటాక్ట్ ఉండటం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కాంటాక్ట్ లెస్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎప్పటినుంచో కార్యాచరణ సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా మనుషుల ద్వారా కాకుండా   డ్రోన్ వ్యవస్థ ద్వారా మందులు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే  ఇక ఇప్పుడు ఇది అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

 తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి డ్రోన్ల ద్వారా కరోనా వైరస్ మందులు, టీకాలు పంపిణీ చేయనున్నట్లు ఇటీవల మంత్రి కేటీఆర్ తెలిపారు.  తొలిదశలో ట్రయల్ రన్ కింద ఇవాళ్టినుంచి ఈ నెల 17 వరకు కూడా వికారాబాద్ ఇలాలో ఈ డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్లు సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్కై ఎయిర్ మొబిలిటీ సాయంతో ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు కేటీఆర్. కాగా 11వ తేదీ నుంచి 9 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలలో డ్రోన్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సరికొత్త సేవలు ప్రారంభించడం వల్ల అటు కరోనా వైరస్ వ్యాప్తి మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: